శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 29 మే 2017 (09:58 IST)

అల్‌ఖైదాకు వారసుడు వచ్చాడు.. చాలా తెలివైనవాడు.. అందగాడు..

ప్రపంచ దేశాలను వణికించిన అల్‌ఖైదా ఒసామా బిన్ లాడెన్ హత్యతో కథ ముగిసిందనుకున్నారు అందరూ.. కానీ ఉగ్రవాద సంస్థ అల్ ఖైదా మళ్లీ బలం పుంజుకుంటుందని వార్తలు వస్తున్నాయి. ఇందుకు కారణంగా అల్ ఖైదాకు వారసుడు రావ

ప్రపంచ దేశాలను వణికించిన అల్‌ఖైదా ఒసామా బిన్ లాడెన్ హత్యతో కథ ముగిసిందనుకున్నారు అందరూ.. కానీ ఉగ్రవాద సంస్థ అల్ ఖైదా మళ్లీ బలం పుంజుకుంటుందని వార్తలు వస్తున్నాయి. ఇందుకు కారణంగా అల్ ఖైదాకు వారసుడు రావడమే. 28 ఏళ్ల హమ్జా బిన్ లాడెన్ రంగంలోకి రావడంతో పలు దేశాల నిఘా సంస్థలు అంశంపైనే దృష్టి సారించాయి. హమ్జా అల్‌ఖైదా ఒకప్పటి అధినేత అయిన ఒసామా బిన్ లాడెన్ కుమారుడే కావడం గమనార్హం. 
 
అల్‌ఖైదాకు చెందిన పలువురు అగ్రనాయకులు కూడా గతంలో హమ్జానే వారసుడని తీర్మానించారు. రెండేళ్ల క్రితమే అతన్ని ''గుహ నుంచి వచ్చిన సింహమ"ని అల్ జవహరి అభివర్ణించారు. నిజానికి ఒసామాకు కూడా ఇలాంటి అభిప్రాయమే ఉండేది. ఒసామాకు ఉన్న 20 మంది సంతానంలో హమ్జా 15వ వాడు. మూడో భార్య ఖైరియా సబర్ కుమారుడు. ఖైరియా అంటే ఒసామాకు ఎంతో ఇష్టం.
 
కొంతకాలం ఖైరియా పశ్చిమ పాకిస్థాన్‌లో కూడా నివసించాడు. ఆయనకు పెళ్లయిందని, ఇద్దరు పిల్లలు ఉన్నారని కూడా తెలిసింది. అయితే ఆయన ఫొటో ఎక్కడా బయటపడలేదు. మృదుభాషి, చాలా తెలివైనవాడు, అందగాడని అందరూ అంటారు.