గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Raju
Last Modified: హైదరాాబాద్ , సోమవారం, 23 జనవరి 2017 (05:47 IST)

మీకు చేతకాక మాపై పడితే ఎలా బిగ్ బ్రదర్: అమెరికాపై ఆలీబాబా విసుర్లు

యావత్ ప్రపంచాన్ని సుసుంపన్నంగా మార్చిన అమెరికా తాను మాత్రం వెనుకబడిపోయిందని అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదే పదే చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టే స్వరం చైనా నుంచి వచ్చింది. అమెరికా ఆర్థిక మందకొడితనానికి కారణం అమెరికానే కానీ మరెవ్వరూ కాదని చ

యావత్ ప్రపంచాన్ని సుసుంపన్నంగా మార్చిన అమెరికా తాను మాత్రం వెనుకబడిపోయిందని అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదే పదే చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టే స్వరం చైనా నుంచి వచ్చింది. అమెరికా ఆర్థిక మందకొడితనానికి కారణం అమెరికానే కానీ మరెవ్వరూ కాదని చైనా ఈ-కామర్స్ దిగ్గజం ఆలీబాబా.కామ్ వ్యవస్థాపకుడు జాక్ మా ఆక్షేపించారు. యుద్ధాల కోసం తాను చేసిన ఖర్చుల కారణంతోటే  అమెరికా ఆర్థిక పరిస్థితి దెబ్బతింది గానీ చైనాతో వ్యాపార సంబంధాల వల్ల కాదన్నారు. అమెరికా గత 30 ఏళ్లలో రూ.952లక్షల కోట్లను మౌలిక సదుపాయాలపై కాకుండా యుద్ధాలపై వెచ్చించిందని తెలిపారు. 
 
బీజింగ్‌ అమెరికా ప్రస్తుత ఆర్థిక పరిస్థితి కారణం ఆ దేశమేనని అలీబాబా డాట్‌ కామ్‌ అధినేత జాక్‌ మా ఆరోపించారు. యుద్ధాల కోసం ఆ దేశం చేసిన ఖర్చుల కారణంతోటే ఆర్థిక పరిస్థితి దెబ్బతిందే గానీ చైనాతో వ్యాపార సంబంధాల వల్లకాదన్నారు. అమెరికా గత 30 ఏళ్లలో రూ.952లక్షల కోట్లను మౌలిక సదుపాయాలపై కాకుండా యుద్ధాలపై వెచ్చించిందని తెలిపారు.
 
డొనాల్డ్ ట్రంప్ హయాంలో అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం గురించి పదే పదే వస్తున్న వ్యాఖ్యానాలను జాక్ మా ఖండించారు. అమెరికా ఆర్థిక దుస్థితికి ఆ దేశం సాగించిన యుధ్ధాలే కారణం కానీ చైనాతో వ్యాపార సంబంధాల వల్ల కాదని జాక్ మా తేల్చి చెప్పారు. యుద్ధాల కోసం అమెరికా చేసిన భారీ వ్యయాలే అమెరికా పతనానికి దారితీశాయని జాక్ స్పష్టం చేశారు. 
 
చాలామంది భావిస్తున్నట్లు అమెరికన్ల ఉద్యోగాలను చైనా దొంగిలించలేదని అన్నారు. అమెరికా వ్యూహాత్మకంగా చేసిన స్వయంకృత అపరాధాల కారణంగా అక్కడ ఉద్యోగాల కొరత ఏర్పడిందని చెప్పారు. ముప్పై ఏళ్ల క్రితం మేథోసంపత్తిపై హక్కులను మాత్రం ఉంచుకొని తక్కువస్థాయి కార్మిక ఉద్యోగాలను మిగిలిన ప్రపంచానికి అమెరికా వదిలేసిందని జాక్‌మా అన్నారు. ఆ కారణంగానే ఐబీఎం, మైక్రోసాఫ్ట్‌ లాంటి కంపెనీలు భారీగా ఆదాయాన్ని సాధించాయని పేర్కొన్నారు. 
 
మైక్రోసాఫ్ట్, ఐబీఎం వంటి బహుళజాతి కంపెనీలు ప్రపంచీకరణ ద్వారా బిలియన్లాది డాలర్ల లాభాలను సృష్టించాయని, ఈ భారీ మొత్తాలను స్వదేశంలో మౌలిక సదుపాయాలకు ఉపాధి కల్పనకు వెచ్చించకుండా 13 యుద్ధాలపై అమెరికా ఖర్చుపెట్టిందని, నిధులను హేతుబద్ధంగా కేటాయించడంలో ఘోరవైపల్యమే అమెరికా దుస్థితికి కారణమని  జాక్ మా తేల్చి చెప్పారు.అమెరికన్ కంపెనీలు ఆసియా ఖండంలో ఆలీబాబా ప్లాట్‌ఫారంపై తమ ఉత్పత్తులు అమ్మినట్లయితే పలు మార్గాల్లో పది లక్షలమంది అమెరికన్లకు ఉపాధి లభిస్తుందని, ట్రంప్ ప్రభుత్వం ఇలాంటి ఉత్పాదకతా అంశాలపై దృష్టి పెడితే తనకూ, ప్రపందానికీ మంచిదని ఆలీబాబా. కామ్ వ్యవస్థాపకుడు జాక్ మా హితవుచెప్పారు. 
 
వ్యాపార యుద్ధాన్ని ప్రారంభించడం తేలికే కానీ ముగించడం కష్టం అని ఆయన అన్నారు. ఈ యుద్ధం ముగియాలంటే అసలు యుద్ధం ప్రారంభం కావాలని అన్నారు. సాధారణంగా వ్యాపారం వల్ల ప్రజల ఆలోచనలు, సంస్కృతులను పంచుకుంటారని అన్నారు. 
 
1979లో చైనా అమెరికా వ్యాపార విలువ 2.5 బిలియన్‌ డాలర్లు అని అది 2016 నాటికి అంటే  38 ఏళ్లలో 211 రెట్లు పెరిగి 519 బిలియన్‌ డాలర్లు అయింది. కానీ అమెరికాకు చైనా 400 బిలియన్ డాలర్ల సరుకులను ఎగుమతి చేయడంతో ఇరుదేశాల మధ్య వాణి్జ్య సమతూకం చైనాకే ఎక్కువ అనుకూలంగా మారింది.