Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

భారత్ - చైనా దేశాల మధ్య టెన్షన్.. టెన్షన్... భారీ సంఖ్యలో బలగాల మొహరింపు

శుక్రవారం, 30 జూన్ 2017 (10:23 IST)

Widgets Magazine
india - china

భారత్, చైనా దేశాల మధ్య మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరు దేశాలు భారీ సంఖ్యలో బలగాలను మొహరించాయి. ఇలాంటి పరిస్థితి దశాబ్దాలకాలం తర్వాత ఉత్పన్నం కావడం గమనార్హం. సిక్కిం-భూటాన్-టిబెట్ త్రి కూడలి (ట్రై జంక్షన్) వద్ద ఈ పరిస్థితి నెలకొంది.
 
భూటాన్ భూభాగమైన డోక్లం దిశగా త్రికూడలి వరకు చైనా రోడ్డును నిర్మిస్తోంది. 40 టన్నుల బరువును తట్టుకునేలా చైనా ‘క్లాస్-40’ రోడ్డు నిర్మాణాన్ని చేపట్టింది. దీన్ని భూటాన్ సహా భారత్ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. 
 
ఈ నేపథ్యంలో ఇండియన్ ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ గురువారం గ్యాంగ్‌టక్‌లోని 17 మౌంటైన్ డివిజన్, కలింపోంగ్‌లోని 27 మౌంటైన్ డివిజన్‌లను సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. అనంతరం ప్రత్యర్థులిద్దరూ పెద్ద ఎత్తున బలగాలను మోహరించి సెక్యూరిటీని పటిష్టం చేసినట్టు సమాచారం. 
 
తాజా పరిణామాలపై స్పందించేందుకు ఇండియన్ ఆర్మీ నిరాకరించింది. గతంలోనూ దళాలను మోహరించినా ప్రస్తుత పరిస్థితి మాత్రం తీవ్ర ఉద్రిక్తంగా ఉన్నట్టు తెలుస్తోంది. 'ప్రస్తుతం తమ దళాలను ఉపసంహరించేందుకు రెండు దేశాలు సిద్ధంగా లేవు. ఇరు దేశాల కమాండర్ల మధ్య ఫ్లాగ్ మీటింగులు, ఇతర చర్చలు ఇప్పటి వరకు జరగలేదు' అని ఆర్మీ వర్గాలు తెలిపాయి. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

వారణాసిలో దారుణం.. 70 యేళ్ళ ఫ్రెంచ్ మహిళపై గార్డు అత్యాచారం

పవిత్ర పుణ్యస్థలం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రాతినిథ్యం వహిస్తున్న వారణాసిలో ఓ విదేశీ ...

news

పాములాగా బుసలు కొడుతూ నాగిని డాన్స్ చేసిన వరుడు.. షాకిచ్చిన వధువు

పీకల వరకు మద్యం సేవించి పాములాగా బుసలు కొడుతూ నాగిని డాన్స్ చేసిన వరుడికి ఓ వధువు ...

news

లింగ నిర్ధారణ చేస్తాడు.. ఆడపిల్ల అయితే అమ్మాల్సిందే.. వైద్యుడి వ్యాపారం

తెలంగాణ రాష్ట్రంలోని మహబూబాబాద్‌ జిల్లాలో ఓ డాక్టర్ వైద్య వృత్తికే కళంకం తెచ్చేలా ...

news

ప‌వ‌న్ క‌ల్యాణ్‌ రబ్బర్ సింగో, గబ్బర్ సింగో తేల్చుకోవాలి: వైసీపీ ఎమ్మెల్యే రోజా

సినీన‌టుడు, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌ రబ్బర్ సింగో, గబ్బర్ సింగో తేల్చుకోవాలని ...

Widgets Magazine