Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

తప్పతాగి డ్యాన్స్ చేశారు.. గాల్లోకి కాల్పులు జరిపారు.. 13 ఏళ్ల కుర్రాడిని చంపేశారు..

గురువారం, 2 ఫిబ్రవరి 2017 (17:10 IST)

Widgets Magazine
gunshot

మ్యూజిక్ విని ఫంక్షన్‌కు వెళ్ళిన 13ఏళ్ల పిల్లాడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన థానే సమీపంలోనే గైక్వాడ్ పాడలో చోటుచేసుకుంది. వేడుకలకు వచ్చిన ఓ బంధువు తప్పతాగి గాల్లోకి జరిపిన కాల్పుల్లో 13 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే.. ఐదు రోజుల పిల్లాడికి నామకరణం చేసే ఆ ఫంక్షన్‌ను చూసేందుకు పక్కింటి అబ్బాయి వెళ్ళాడు. అయితే ఆ ఫంక్షన్‌కు వచ్చిన వారంతా తప్పతాగి డ్యాన్స్ చేశారు. వీరిలో ఓ బంధువు గాల్లోకి కాల్పులు జరపడంతో పొరపాటున అక్కడే ఉన్న పక్కింటి బాలుడిపై తీవ్రంగా గాయపడ్డాడు. 
 
అయితే ఈ విషయాన్ని బాలుడి తల్లిదండ్రులకు చెప్పకుండా అతడిని ఆస్పత్రికి తరలించారు. వారికి ఆ పిల్లాడు తమ ఇంట్లోని నిద్రపోతున్నాడని నమ్మబలికారు. తీరా ఉదయం బాలుడు చనిపోయిన తర్వాత అతడి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. అయితే వారంతా తప్పతాగి డ్యాన్స్ చేస్తూ చివరికి ఇంతటి అఘాయిత్యానికి దిగారని మృతుడి తండ్రి ఆరోపించారు. ఈ కేసులో ఇప్పటికే పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు. సాక్ష్యాధారాలను మాయం చేసేందుకు ఇంట్లోని సీసీ వీడియో ఫూటేజిలను కూడా ధ్వంసం చేసినట్టు పోలీసులు వెల్లడించారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

మాదక ద్రవ్యాలకు బానిసైపోయాడు.. ప్రశ్నించిన తల్లిని కాంపస్‌తో పొడిచేశాడు..

మాదక ద్రవ్యాలకు బానిస అయిపోయిన కన్నకొడుకును తన మాటలతో సరిదిద్దాలనుకున్న పాపానికి.. ఆమెకు ...

news

అయ్యా.. పవనూ ట్వీట్లొద్దు కానీ.. క్లారిటీ కావాలి: గుడివాడ అమర్నాథ్

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ జనసేన అధినేత, ...

news

మంటగలిసిన మానవత్వం... ప్రమాదంలో రక్తమోడుతున్న బాలుడిని ఫోటోల కోసమే....

మానవత్వం మంటగలుస్తుందోన్న మాటకు మరో నిదర్శనం కర్నాటకలో ఈ దారుణం. 15 ఏళ్ల అలీ అనే బాలుడు ...

news

అనంతలో బీహార్ ఆటవిక చర్య : మంచినీటి తొట్టె వద్దన్నందుకు మహిళను చితక్కొట్టారు

గతంలో బీహార్ రాష్ట్రంలో ఎక్కువగా ఆటవిక చర్యలు జరుగుతుండేవి. ఇలాంటి ఆటవిక చర్యలు ఇపుడు ...

Widgets Magazine