గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 27 మే 2016 (17:17 IST)

బ్రెజిల్‌లో షాకింగ్ న్యూస్ : 16 యేళ్ల బాలికపై 30 మంది సామూహిక అత్యాచారం (వీడియో)

బెజిల్‌లో దారుణం జరిగింది. 16 యేళ్ళ బాలికపై 30 మంది కామాంధులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణం బ్రెజిల్‌లోని రియో డీ జనైరో ప్రాంతంలో జరుగగా, శుక్రవారం వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియో, వార్త సోషల్ మీడియాలో వైరల్‌లా వ్యాపించింది. 
 
బ్రెజిల్‌కు చెందిన ఓ టీనేజ్ యువతిపై 30 మంది మగాళ్లు మృగాల్లా విరుచుకుపడ్డారు. ఒకరి తర్వాత ఒకరు తమ కామవాంఛ తీర్చుకున్నారు. అంతటితో ఆగని ఆ కామాంధులు తమ ఘన కార్యాన్ని ఫోటోలు తీసి సోషల్‌ మీడియాలో అప్‌లోడ్ చేశారు. ఇవి వైరల్‌లా వ్యాపించాయి. 
 
ఇందులో రేప్ వీడియో, ఆ యువతి నగ్న చిత్రాలు ఉన్నాయి. వీటిని నెట్‌లో పెట్టి పైశాచిక ఆనందం పొందారు. ఆ కామాంధుల చెర నుంచి తప్పించుకున్న బాధిత యువతి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు 30 మంది కామాంధుల కోసం ఆ ప్రాంతంలో గాలిస్తున్నారు. ట్విటర్ ఖాతాల ఆధారంగా కామాంధుల కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు.