ప్రియుడి మృతి.. అతడి వారసుడిని కనాలనుకుంది.. సోషల్ మీడియాలో వైరల్

సోమవారం, 13 నవంబరు 2017 (16:00 IST)

రోడ్డు ప్రమాదంలో ప్రియుడు ప్రాణాలు కోల్పోయాడు. అయితే ఆ ప్రేయసి అతనిని మరిచి.. కొత్త జీవితాన్ని ప్రారంభించలేదు. మరణించిన ప్రియుడి బిడ్డకు తల్లి కావాలనుకుంది. ఇందుకు కోర్టు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ఘటన ఆస్ట్రేలియాలో చోటుచేసుకుంది. ఆస్ట్రేలియాకు చెందిన ఈ ప్రేమ కథ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
 
వివరాల్లోకి వెళితే.. డేవిస్, ఐలా ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుందామనుకున్నారు. ఇంతలోనే ఓ రోడ్డు ప్రమాదంలో డేవిస్ మృతి చెందాడు. అయితే ఐలా  అతనిని మర్చిపోయి కొత్తజీవితం ప్రారంభించలేదు. దీంతో తన ప్రియుడి వీర్యంతో పిల్లల్ని కనాలని నిర్ణయించుకుంది.
 
ఐవీఎఫ్ పధ్ధతిలో డేవిస్ వారసుడిని కనాలని నిర్ణయించుకుంది. దీంతో ప్రియుడు మరణించిన కొన్ని గంటల్లోనే అతనితో పిల్లల్ని కనేందుకు అనుమతినివ్వాలని కోర్టుకు కోరింది. కోర్టు కూడా డేవిస్ వీర్యాన్నీ తీసి భద్రపరచాల్సిందిగా ఆదేశించింది. అనంతరం ఈ కేసుపై రెండు నెలల సుదీర్ఘ విచారణ జరిగింది. 
 
ఈ రెండు నెలల విచారణలో న్యాయస్థానానికి ఐలా ఎన్నో ఆధారాల‌ను స‌మ‌ర్పించింది. దీంతో డేవిస్ వీర్యంతో పిల్లల్ని కనేందుకు న్యాయస్థానం అనుమతించింది. కృత్రిమ గ‌ర్భ‌దార‌ణ విధానం ద్వారా ఓ క్లినిక్‌‌లో ఈ ప్ర‌క్రియ‌ను చేప‌ట్టాల‌ని ఆదేశించింది. దీంతో సోషల్ మీడియాలో అరుదైన ప్రేమికురాలిగా ఐలా గుర్తింపు పొందింది. ఐలా లవ్ స్టోరీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.దీనిపై మరింత చదవండి :  
Brisbane Boyfriend Sperm Baby Ayla Cresswell Joshua Davies

Loading comments ...

తెలుగు వార్తలు

news

ట్రిపుల్ రైడింగ్ చేస్తే ట్రిపుల్ ఫైన్ చెల్లించాల్సిందే.. ఎక్కడ?

కొన్ని సందర్భాల్లో ద్విచక్రవాహనాల్లో ముగ్గురేసి ప్రయాణిస్తుంటారు. ఇలా ట్రిపుల్ రైడింగ్‌లో ...

news

కొత్త సంవత్సరం నుంచి రైతులందరికీ 24 గంటల కరెంట్ : కేసీఆర్

కొత్త సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రంలోని రైతులందరికీ 24 గంటల పాటు కరెంట్ సరఫరా చేయనున్నట్టు ...

news

కాంగోలో ఘోర రైలు ప్రమాదం.. 33మంది మృతి.. భోగీల్లో నిప్పంటుకోవడంతో?

నవంబర్ 13 2017.. సోమవారం ప్రపంచ వ్యాప్తంగా ప్రమాదాల్లో మృత్యువాత పడిన వారి సంఖ్య ...

news

ఆత్మకు శాంతి చేకూరాలని చెపితే సరిపోతుందా? జరిగిన నష్టం పూడ్చలేనిది : పవన్

కృష్ణానదిలో జరిగిన బోటు ప్రమాదంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతిని ...