గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By CVR
Last Updated : మంగళవారం, 31 మార్చి 2015 (15:32 IST)

బ్రిటీష్ రాణికి జీతాల తంటా... సిబ్బంది సమ్మె సైరన్..!

జీతాలను పెంచకుంటే విధులకు హాజరుకామని బ్రిటీష్ రాణి ఎలిజబెత్ నివాసం విండ్ సర్ క్యాజిల్‌లో పనిచేసే సిబ్బంది హెచ్చరిస్తున్నారు. అంతేకాదు, తమకు జీతాలు పెంచాలన్న డిమాండ్ న్యాయమైందని నిరూపించేందుకు ఓటింగ్ కూడా నిర్వహించాలని నిర్ణయం తెలుపుతున్నారు.  
 
వెస్ట్ లండన్‌లో ఉన్న 900 ఏళ్ల కాలం నాటి ఈ అందమైన భవంతిలో సుమారు 200 మంది పనిచేస్తున్నారు. తమకు ఏడాదికి కేవలం 14,400 పౌండ్లు (రూ 13.35 లక్షలు) చెల్లిస్తున్నారని, అవి తమకు కనీస అవసరాలకు కూడా సరిపోడవం లేదని, ఎలాగైనా సరే వాటిని పెంచాలని డిమాండ్ చేస్తున్నారు.
 
ఆ సిబ్బంది పబ్లిక్ అండ్ కమర్షియల్ సర్వీసెస్ యూనియన్ (పీసీఎస్) ద్వారా తమ భవిష్యత్ కార్యాచరణ చేపట్టాలని భావిస్తున్నారు. వీరిలో సుమారు 120 మంది ఎలిజబెత్ రాణి వ్వవహారి శైలిపై నేరుగా విమర్శలు చేశారు. అదనంగా విధులు నిర్వహిస్తున్న వారికి ఎలాంటి చెల్లింపులు చేయడం లేదని, వచ్చిన అతిథులకు రాయల్ ట్రీట్‌మెంట్ చేసేది వీరేనని పీసీఎస్ జనరల్ సెక్రటరీ మార్క్ సెర్‌వోట్కా పేర్కొన్నారు. 
 
విండ్ సర్ క్యాజిల్‌లో పనిచేసే మొత్తం 200 మంది ఉద్యోగులు ఏప్రిల్ 14న ఇండస్ట్రీయల్ యాక్షన్‌ తీసుకునేందుకు బ్యాలెట్ ఓటింగ్ చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ వ్యవహారం రాణికి తలనొప్పిగా మారిందని సమాచారం.