మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 24 అక్టోబరు 2014 (11:35 IST)

బ్రిటీష్ పార్లమెంట్‌లో ఎలుకలు: రంగంలోకి పిల్లులు?

బ్రిటీష్ పార్లమెంట్‌లో ఎలుకలు పడ్డాయి. దీంతో ఎలుకల్ని పట్టేందుకు పిల్లులను రంగంలోకి దించాలనుకుంటున్నారు. ఉభయసభల భవనాల్లో ఎలుకలు స్వైరవిహారం చేస్తున్నాయి.

ఎలుకలు లెక్కకు మిక్కిలి సంఖ్యలో ఉండగా, వాటికి ఒకట్రెండు పిల్లులు సరిపోవని ఎంపీ జాన్ థుర్సో అన్నారు. కానీ, పిల్లులు ఎక్కువైనా చిక్కేనని ఆయన అభిప్రాయపడ్డారు. 
 
పార్లమెంటులో ఆహార పదార్ధాలు తయారుచేసే ప్రదేశాల్లో ఎలుకలు సంచరిస్తే, వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని ఎంపీ అన్నే మెకింటోష్ ఆందోళన వ్యక్తం చేశారు. 
 
కాగా, 2011లో ప్రధాని అధికారిక నివాసం డౌనింగ్ స్ట్రీట్ లో ఎలుక ఒకటి సంచరించడం టీవీ చానళ్ళలో ప్రసారమైన సంగతి తెలిసిందే.