గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 24 నవంబరు 2015 (19:30 IST)

తొలి ప్రపంచ యుద్ధం: ఇన్విజబుల్‌ ఇంక్‌కు బదులుగా వీర్యాన్ని వాడారట!

తొలి ప్రపంచ యుద్ధం సమయంలో ఇన్విజబుల్ ఇంక్ కొరత కారణంగా మానవ ప్రత్యుత్పత్తికి ఉపయోగపడే స్పెర్మ్ (వీర్యం)ను ఇన్విజబుల్ ఇంక్‌గా వాడారని తెలిసింది. తొలి ప్రపంచ యుద్ధ సమయంలో బ్రిటీష్ సీక్రెట్ ఇంటెలిజన్స్ సర్వీస్ (ఎమ్ఐ6) సభ్యులు వేరే శిబిరానికి చాలా రహస్యంగా సమాచారం పంపించాల్సిన అవసరముంది. అయితే ఈ సమాచారాన్ని సాధారణంగా కళ్లకు కనిపించని రసాయనంతో పేపర్ మీద రాస్తారు. అందుకే ఇన్విజబుల్ ఇంక్‌ను వాడతారు.  
 
కానీ, ఆ సమయంలో వారివద్ద ఇన్విజబుల్‌ ఇంక్‌ లేదు. ఆ సమయంలోనే ఖర్చులేని విధంగా ఇన్విజబుల్‌ ఇంక్‌కు బదులుగా వీర్యాన్ని వాడారు. అయితే ఒక్కసారి వీర్యాన్ని అలా ఉపయోగించిన అనంతరం దానిని ఆపేశారు. ఎందుకంటే వీర్యాన్ని ఇన్విజబుల్‌ ఇంక్‌గా వాడడంలో ఓ ప్రమాదం ఉంది. అదేమిటంటే పేపర్‌ మీద పడిన వీర్యం అందులోని సెల్యులోజ్‌తో చర్య జరపడంతో వాసన వస్తుంది. ఈ వాసనను శత్రువులు పసిగడితే ప్రమాదమని నిఘా వర్గాలు పేర్కొనడంతో దాని వాడకాన్ని ఆపేశారని తెలిసింది.