శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : సోమవారం, 22 డిశెంబరు 2014 (11:33 IST)

పాక్ బాలుడు భారత్‌లోకి వచ్చాడు.. సురక్షితంగా చేర్చిన బీఎస్ఎఫ్!

పాకిస్థాన్‌కు చెందిన నాలుగేళ్ళ బాలుడు అలీ సజ్జన్ గోహర్ దారితప్పి, పొరపాటున భారత భూభాగంలోకి ప్రవేశించాడు. ఈ విషయాన్ని గుర్తించిన భారత సరిహద్దు దళం (బీఎస్ఎస్) ఆ బాలుడుని సురక్షితంగా పాక్ సరిహద్దు బలగాలకు అప్పగించింది. ఈ సంఘటన విఘాకోట్ - గుజరాత్ సరిహద్దుల్లో చోటు చేసుకుంది. 
 
‘శుక్రవారం రాత్రి బోర్డర్‌లో తచ్చాడుతున్న పిల్లాడు జవాన్ల కంటపడ్డాడు. పాక్ సైన్యానికి సమాచారం అందించి, పిల్లాడ్ని తల్లిదండ్రులకు అందించాం' అని భుజ్ రేంజ్ బిఎస్‌ఎఫ్ డిప్యూటీ కమాండర్ హిమాంశు గౌర్ వెల్లడించారు.పాక్ సింధ్ ప్రాంతంలోని బదిన్ జిల్లాకు చెందిన దండారి గ్రామవాసిగా పిల్లాడ్ని గుర్తించారు. 
 
భారత్‌వైపు వంద అడుగుల దూరం వచ్చేసిన పిల్లాడు సింధీ తప్ప మరేమీ మాట్లాడలేకపోవడంతో, వివరాలు తెలుసుకోవడం జవాన్లకు కష్టమే అయ్యింది. పాక్ సైన్యంతో ఫ్లాగ్ సమావేశం నిర్వహించిన అనంతరం పిల్లాడ్ని అప్పగించారు. భారత జవాన్లు ప్రదర్శించిన మానవతా దృక్ఫదానికి పాక్ బాలుడి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.