బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 30 మే 2017 (10:34 IST)

కుమార్తెల కోసం ప్రేమ కుటీరాలు... నచ్చితే అబ్బాయితో సహజీవనం...

కాంబోడియా దేశంలో ఉన్న ఆఫ్రికన్ తెగల్లో ఒకటి క్రియుంగ్. ఈ తెగలో కుటుంబ పెద్ద తమ కూతుళ్ళ కోసం ప్రేమ కుటీరాలు నిర్మించి ఇస్తాడు. యుక్త వయస్సు వచ్చినప్పటి నుంచీ ఈ కుటీరాలలోనే ఆడపిల్లలు నివాసం ఉండాల్సి ఉంట

కాంబోడియా దేశంలో ఉన్న ఆఫ్రికన్ తెగల్లో ఒకటి క్రియుంగ్. ఈ తెగలో కుటుంబ పెద్ద తమ కూతుళ్ళ కోసం ప్రేమ కుటీరాలు నిర్మించి ఇస్తాడు. యుక్త వయస్సు వచ్చినప్పటి నుంచీ ఈ కుటీరాలలోనే ఆడపిల్లలు నివాసం ఉండాల్సి ఉంటుంది. అంటే పుట్టిపెరిగిన ఇంటిని వదిలి ఈ కుటీరాల్లోనే నివశించాల్సి ఉంటుంది. అదీ కూడా సరైన జోడీ దొరికేంత వరకూ ఆడపిల్ల ఈ కుటీరంలో ఉండాల్సి.
 
ఈ సమయంలో తమకు నచ్చిన అబ్బాయి తారసపడితే  ఈ కుటీరానికి పిలిపించుకుని వారితో శృంగారంలో పాల్గొనవచ్చు. అదీ కూడా వివాహం జరిగేంత వరకూ వారిద్దరూ కుటీరంలోనే గడుపుతారు. కొన్ని రోజుల తర్వాత ఇద్దరిలో బేధాభిప్రాయాలు తలెత్తితే ఆడపిల్ల మగపిల్లవాడిని పొమ్మని చెప్పవచ్చు. లేదా మగపిల్లవాడే ఆ కుటీరం నుంచి వెళ్ళిపోవచ్చు. 
 
ఒక ఆడపిల్ల ఎంతమంది మగపిల్లలతోనైనా ఈ కుటీరంలో నివసించే అధికారం ఉంటుంది. ఒకసారి పెళ్ళి అయితే మాత్రం భర్తను వదిలే హక్కు ఆమెకు ఉండదు. ఇది కొద్దిగా సహజీవనానికి దగ్గరగా ఉండే ప్రక్రియ. పైగా, ఇది ఆ తెగ ప్రజల ఆచారమట.