శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 30 మే 2016 (09:30 IST)

'బంగారు వర్ణం' అమ్మాయి కావాలా? రేటు 8 వేల డాలర్లు : ఎఫ్‌బీలో ఐఎస్ పోస్ట్

ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు చేస్తున్న ఆగడాలు అన్నీ ఇన్నీకావు. ఇప్పటికే తమ వికృత చేష్టలతో ప్రపంచాన్ని వణికిస్తున్న ఈ కరుడుగట్టిన ఉగ్రవాదులు.. తాజాగా మరో చర్యకు పూనుకున్నారు. తమ చేతుల్లో బందీగా ఉన్న మహిళలను బానిసలుగా విక్రయిస్తున్నారు. ఇందుకోసం వారు వారు మహిళలను శరీర కొలతలతో పాటు.. రంగు, ఆకారం వంటి వివరాలను కూడా ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేస్తున్నారు. 
 
ఇటీవల ఓ అమ్మాయికి చెందిన కొన్ని ఫొటోలను ఓ ఐఎస్ తీవ్రవాది ఎఫ్‌బీలో పోస్టు చేశాడు. ఆ అమ్మాయి అందచందాలు వర్ణిస్తూ.. ఆసక్తిగల వారు కొనుగోలు చేయవచ్చంటూ రేటు కూడా ఫిక్స్ చేశారు. టెంట్‌లో కూర్చొని బురఖా ధరించిన అమ్మాయిని 8 వేల డాలర్లకు అమ్ముతానంటూ పోస్ట్ చేశాడు. అదేక్రమంలో సన్నగా ఉన్న మరో అమ్మాయి ఫొటో పోస్ట్ చేసి.. రేటు 7 వేల డాలర్లు అని పేర్కొన్నాడు. 
 
ఇటీవల అమెరికా, ఐక్యరాజ్యసమితి దేశాలు ఐఎస్‌పై విరుచుకుపడుతుండటంతో ఆ సంస్థ.. నిధుల కోసం అల్లాడుతున్నట్లు తెలుస్తున్నది. గత కొన్నేళ్లుగా తమ శత్రువర్గమైన యాజిదికి చెందిన మహిళలను ఎత్తుకువచ్చి.. సెక్సు బానిసలుగా వినియోగించుకొంటున్న ఉగ్రవాదులు.. నిధుల కోసం ఇప్పుడు వారిని విక్రయిస్తున్నట్లు నిఘా వర్గాలు పేర్కొంటున్నాయి.