బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 28 జనవరి 2015 (11:25 IST)

ఫిడెల్ కాస్ట్రో ఘాటు స్పందన: క్యూబాతో విరోధానికి ముగింపు..

అమెరికాతో సంబంధాలపై క్యూబా మాజీ అధ్యక్షుడు ఫిడెల్ కాస్ట్రో ఘాటుగా స్పందించారు. అమెరికా విధానాలను విశ్వసించే ప్రసక్తిలేదని క్యూబా మాజీ అధ్యక్షుడు ఫిడెల్ క్యాస్ట్రో తెలిపారు.

క్యూబాతో దశాబ్దాలుగా ఉన్న విరోధానికి ముగింపు పలికేందుకు తాము చర్యలు చేపడుతున్నామని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా.. గత నెలలో ప్రకటించిన నేపథ్యంలో కాస్ట్రో ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
 
అయితే సమస్యలను సంఘర్షణలతో కాకుండా.. శాంతియుతంగా పరిష్కరించుకోవాలని తాను కూడా భావిస్తున్నట్లు క్యాస్ట్రో వెల్లడించారు. శాంతిని పరిరక్షించడం అందరి బాధ్యతన్న క్యాస్ట్రో... ప్రపంచ ప్రజలందరితో తాము స్నేహాన్ని కోరుకుంటామన్నామన్నారు. ప్రత్యర్థి దేశాల నేతలతో కూడా స్నేహాన్నే కోరుకుంటున్నామని 88 ఏళ్ల కాస్ట్రో వెల్లడించారు.  
 
కాస్ట్రో పదవిలో ఉండగా.. అతని ప్రభుత్వాన్ని కూల్చేందుకు అమెరికా విశ్వప్రయత్నం చేసినట్టు ఆరోపణలు చాలానే ఉన్నాయి.