బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By CVR
Last Updated : మంగళవారం, 21 ఏప్రియల్ 2015 (09:39 IST)

కత్తులతో కలకలం రేపిన క్యాథే పసిఫిక్ ఎయిర్ లైన్స్ పైలట్ అరెస్టు..

గత కొంత కాలంగా గ్రహణం పట్టినట్టు వరుసగా విమానాలు కుప్పకూలుతుంటే, ఇటీవల విమానాలను నడిపే పైలట్‌లకు మతిచెడినట్టుంది. జర్మన్ వింగ్స్ విమాన పైలెట్ ఉదంతం మరువక ముందే మరో పైలట్ కత్తులు చేతపట్టి కలకలం సృష్టించాడు.
 
అసలు విషయానికి వస్తే.. లండన్ హీత్రూ విమానాశ్రయంలో ఓ పైలట్ (61) కత్తులతో పట్టుబడ్డాడు. క్యాథే పసిఫిక్ ఎయిర్ లైన్స్ కు‌ చెందిన ఈ పైలట్ లండన్ నుంచి హాంకాంగ్ వెళ్లే విమానంలో విధులు నిర్వర్తించాల్సి ఉంది. 
 
విమానంలో 260 మందికి పైగా ప్రయాణికులున్నారు. ఈ స్థితిలో జర్మన్ వింగ్స్ విమానం ఉదంతం నేపథ్యంలో, సిబ్బందిని తనిఖీ చేస్తుండగా ఈ పైలట్ వద్ద కత్తులు దొరికాయి. దీంతో, అతడిని కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించారు. అనంతరం బెయిల్‌పై విడిచిపెట్టారు. ఈ సంఘటన ఆ విమానాశ్రయంలో కలకలం రేపింది.