గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By chitra
Last Updated : శనివారం, 13 ఫిబ్రవరి 2016 (10:49 IST)

అల్జీమర్స్‌తో తల్లి పాట్లు: కేర్ టేకర్‌ను నియమించిన కూతురు.. ఆమె ఏం చేసిందంటే?

వయస్సు‌పై బడిన తల్లిని పరామర్శించడం కోసం ఓ యువతి కేర్‌టేకర్‌ని నియమించుకుంది. ఆ కేర్‌టేకరే ఆ తల్లిపట్ల శాపంగా మారింది. అసలు విషయానికొస్తే వయసు మీద పడ్డ తల్లి అల్జీమర్స్‌తో బాధపడుతుంది. ఈ క్రమంలో తల్లిని కంటికి రెప్పలా చూసుకునేందుకు ఆ యువతి కేర్ టేకర్‌ని నియమించుకుంది. డబ్బు తీసుకుని ముసలావిడను చూసుకోవాల్సిన ఆ కేర్ టేకర్ ఏం చేసిందో... తెలుసా? కదల్లేని స్థితిలో ఉన్న ఆ ముసలావిడను రోజూ చితక్కొట్టేది. చేతులతో నెత్తిపై కొట్టడమే కాకుండా కాళ్లతో తన్నేదట.
 
కాళ్లు కదలలేకున్నా, కాస్తంత చలనం ఉన్న చేతులతో ఆ ముసలావిడ అడ్డు చెప్పబోతే, ఆ కేర్‌టేకర్‌కి కోపమొచ్చేదట. ముసలావిడను ఎత్తి కుదేసి కొట్టేది. కాలక్రమేణ ఇంటికి వచ్చిన ఆ ముసలావిడ కుమార్తెకు ఎందుకో అనుమానం వచ్చింది. సీక్రెట్ కెమెరా ఏర్పాటు చేసింది. ఈ కెమెరాలో ఆ కేర్ టేకర్ ఘాతుకం బయటపడింది. అర్జెంటీనా రాజధాని బ్యూనస్ ఎయిర్స్‌లో రికార్డైనట్లుగా భావిస్తున్న ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది.