శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By JSK
Last Modified: బుధవారం, 29 జూన్ 2016 (11:51 IST)

అమరావతి కోసం బులెట్ ట్రైన్‌లో గంటకు 140 కి.మీ వేగంతో బాబు ప్రయాణం... ఎందుకు?

చైనా: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బులెట్ ట్రైన్‌లో ప్రయాణించారు. 140 కి.మీ దూరంలోని బీజింగ్‌కు టియాంజిన్‌ నుంచి 31 నిమిషాల్లోనే చేరుకున్నారు. చంద్రబాబు ప్రయాణించిన ట్రైన్ గంటకు 295 కి.మీ వేగంతో నడిచింది. ముఖ్యమంత్రి వెంట యనమల కూడా ప్రయాణించారు. అయిత

చైనా: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బులెట్ ట్రైన్‌లో ప్రయాణించారు. 140 కి.మీ దూరంలోని బీజింగ్‌కు టియాంజిన్‌ నుంచి 31 నిమిషాల్లోనే చేరుకున్నారు. చంద్రబాబు ప్రయాణించిన ట్రైన్ గంటకు 295 కి.మీ వేగంతో నడిచింది. ముఖ్యమంత్రి వెంట యనమల కూడా ప్రయాణించారు. అయితే ఇదంతా ఏదో స‌ర‌దాకి కాదు... సీఎం బుల్లెట్‌ ట్రైన్లు, హైస్పీడ్‌ ట్రైన్లపై అధ్యయనం చేస్తున్నారు.
 
అమరావతి-విశాఖ, అమరావతి-హైదరాబాద్‌ మార్గాల్లో బుల్లెట్‌ లేదా హైస్పీడ్‌ ట్రైన్లు ప్రవేశపెట్టే అవకాశాలను చంద్రబాబు పరిశీలిస్తున్నారు. దీనిపై ఉన్న‌తాధికారుల‌తో ఒక నివేదిక త‌యారుచేయించి రైల్వే శాఖ‌కు ఇవ్వాల‌ని ప్ర‌తిపాదించారు. న‌వ్యాంధ్రప్ర‌దేశ్ లోనూ బెల్లెట్ ట్రైన్, హైస్పీడ్ రైళ్ళ‌ను ప్రారంభించాల‌ని సీఎం కోరిక‌. మ‌రి అది కేంద్రం నెర‌వేరుస్తుందో లేదో వేచి చూడాలి.