శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By CVR
Last Updated : బుధవారం, 19 నవంబరు 2014 (18:30 IST)

80 ఏళ్ల హంతకుడితో యువతికి వివాహం

అమెరికాలోని లాసేంజిల్స్‌కు చెందిన ఛార్లెస్ మేన్సిన్ (80). ఇతను గత 1969లో ఏడుగురిని దారుణంగా హత్య చేశాడు. ముఖ్యంగా డైరక్టర్ రోమన్ పోనల్స్‌కిన్ ఎనిమిది నెలల గర్భవతి అయిన భార్య షరేన్ టెట్ అనే మహిళను హతమార్చాడు. 
 
ఈ దారుణ హత్యలకు పాల్పడ్డ ఇతనిపై కోర్టులో కేసు నమోదు చేశారు. ఈ కేసులో అతనికి జీవితాంతం జైలు జీవితం గడపాలని తీర్పువచ్చింది. ప్రస్తుతం ఇతను లాసేంజిల్స్‌లోని జైలులో ఉంటున్నాడు. అక్కడ అతనిని సూప్టన్ ఎలైన్స్ పార్టన్ అనే 26 ఏళ్ల యువతి అప్పుడప్పుడు చూసేందుకు వస్తూ ఉన్నది. వారి మధ్య ప్రేమ చిగురించింది. 
 
దీంతో వారిద్దరి వివాహం చేసుకునేందుకు నిర్ణయించారు. మేన్సిన్ జైలు ఖైదీ  కావడంతో క్యాలిఫోనియాలో ఉన్న పునరావాస శాఖలో అనుమతి పొందాల్సి ఉంది. అతను తనకంటే 54 ఏళ్ల వయస్సు తక్కువగా ఉన్న పార్టన్‌ను పెళ్లి  చేసుకునేందుకు అనుమతి కోరుతూ గత 7వ తేది దరఖాస్తు చేసుకున్నాడు. దానికి అంగీకారం లభించింది.  దీంతో త్వరలో వీరిద్దరు వివాహం చేసుకోనున్నారు. 
 
మేన్సిన్ గత 40 ఏళ్ళకు పైగా జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. ఈ వివాహం గురించి 26 ఏళ్ల యువతి పార్టన్ మాట్లాడుతూ తాము ప్రేమించుకుంటున్నట్టు తెలిపింది. తాను మేన్సిన్‌తో జీవితాతం ఉంటానని పేర్కొంది. ప్రేమకు వయస్సు అడ్డంకి కాదనడానికి మాత్రమే కాదు, ప్రేమ గుడ్డిది అనడానికి కూడా ఈ జంట నిదర్శనంగా నిలుస్తారు.