Widgets Magazine

చికాగో వ్యభిచార దందా : ఆ హీరోయిన్‌కు నెలకు రూ.30 లక్షలు

గురువారం, 12 జులై 2018 (09:09 IST)

అమెరికాలోని చికాగోలో వెలుగు చూసిన వ్యభిచార దందాపై యూఎస్ పోలీసుల వేగవంతమైంది. ఈ విచారణలో అనేక సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. ముఖ్యంగా, ఈ దందాలో తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన వెయ్యి మంది పాత్ర ఉన్నట్టు ప్రాథమిక సమాచారం. అంతేకాకుండా, క్రమం తప్పకుండా అమెరికా వెళ్ళి విటులకు పడక సుఖం అందిస్తూ వచ్చిన ఓ హీరోయిన్‌కు ఠంచనుగా నెలకు రూ.30 లక్షల చొప్పున చెల్లించినట్టు వార్తలు గుప్పుమంటున్నాయి. మొత్తంమీద ఈ వ్యభిచార దందాపై అమెరికా పోలీసుల విచారణలో అనేక సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
prostitute tester
 
తెలుగు చిత్ర పరిశ్రమను ఓ కుదుపుకుదిపిన చికాగో సెక్స్ స్కామ్‌ విచారణలో భాగంగా, నిర్వహకుడు మొదుగుమూడి కిషన్‌కు చెల్లింపులు చేసిన వారిని అమెరికా దర్యాప్తు అధికారులు విచారిస్తున్నారు. ఇప్పటిదాకా వందమందికి పైగా నోటీసులు అందుకున్నారు. వీరిని అమెరికా హోంల్యాండ్‌ సెక్యూరిటీ అధికారులు తమ కార్యాలయాలకు పిలిపించి విచారిస్తున్నారు. 'నాకు తెలిసిన ఒక వ్యక్తికి హోంల్యాండ్‌ సెక్యూరిటీ ఏజెంట్లు నోటీసులు పంపారు. న్యాయవాది సలహా మేరకు శుక్రవారం అధికారుల ముందు హాజరయ్యాడు. తాను ఒక సినీనటితో ఎప్పుడు గడిపిందీ, ఆమెకు ఎంత చెల్లించిందీ? ఏ క్రెడిట్‌ కార్డుపై చెల్లించిందీ? మొదలైన సమాచారం అంతా ఇచ్చాడు. ఇలా నోటీసులు అందుకున్న వాళ్లు వందమందికి పైగా ఉన్నారు' అని ఈ కేసును దగ్గర నుంచి పరిశీలిస్తున్న ఒక వ్యక్తి తెలిపారు. 
 
అంతేకాకుండా, "మా లెక్కల ప్రకారం ఒకో హీరోయిన్‌ లేదా యాంకర్‌ నెల రోజుల్లో 25 నుంచి 30 లక్షలు సంపాదించి ఉండాలి. అంతే మొత్తాన్ని మొదుగుమూడి కూడా సంపాదించాడు. ఇలాంటి వారు మొదుగుమూడి దగ్గర కనీసం ఐదుగురు ఉన్నారనుకుందాం. అంటే ఏడాదికి అతని సంపాదన రూ.పది కోట్లకు పైనే. ఇలా రెండేళ్లు సంపాదించాడనుకుందాం. అంటే కనీసం రూ.20 కోట్లు సంపాదించాలి. ఈ మొత్తమంతా భారత్‌కు పంపేసి ఉండాలి. లేకపోతే ఇప్పుడు మొదుగుమూడి దంపతులు అంత ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన అవసరం ఏముంది?'' అని సదరు వ్యక్తి అభిప్రాయపడుతున్నారు. 


Widgets Magazine
Widgets Magazine

దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

అమ్మాయిలతో వ్యభిచారం.. వాడేసిన కండోమ్స్‌తో బ్లాక్‌మెయిల్.. ఎక్కడ?

తాము ఇంజనీరింగ్ విద్యార్థినులమని చెప్పి కొందరు అమ్మాయిలు గుట్టుచప్పుడుకాకుండా సాగిస్తున్న ...

news

రసాయన సూదులతో 20 మంది వృద్ధులను చంపిన నర్సు

జపాన్ దేశంలోని సబర్బన్ టోక్యోకు చెందిన ఓ నర్సు అత్యంత కిరాతకంగా ప్రవర్తించింది. ప్రాణాంతక ...

news

ఎస్.బి.ఐ కాల్‌సెంటర్ పేరుతో రూ.5 కోట్లు కొట్టేశారు.. ఎలా?

ఇటీవలి కాలంలో ఆన్‌లైన్ మోసాలు ఎక్కువైపోతున్నాయి. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వంతో పాటు ఆయా ...

news

తల్లి గర్భం నుంచే సీఎం.. సీఎం అంటూ జగన్ బయటకొచ్చాడు... పాలిటిక్స్‌కు గుడ్‌బై : జేసీ

వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ...

Widgets Magazine