శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : శుక్రవారం, 19 సెప్టెంబరు 2014 (14:58 IST)

చైనాలో కన్యత్వం రేటు రూ.3 లక్షలు : కోర్టు తీర్పు!

తన ప్రియుడి బూటకపు మాటలు నమ్మి ఎంతో విలువైన తన కన్యత్వాన్ని సమర్పించానని, దీనికి నష్టపరిహారం చెల్లించేలా తన మాజీ ప్రియుడిని ఒప్పించాలని కోరుతూ చైనాకు చెందిన ఓ యువతి కోర్టు మెట్లెక్కింది. కన్యాత్వాన్ని దోచుకుంటే దోచుకున్నాడుగానీ, నష్టపరిహారంగా తనకు 81 వేల డాలర్లు (రూ.49 లక్షలు), వైద్య ఖర్చుల కోసం రూ.15 వేలు ఇప్పించడంటూ న్యాయమూర్తిని వేడుకుంది. ఆమె విజ్ఞప్తిని ఆలకించిన న్యాయమూర్తి మాత్రం రూ.3 లక్షలు మాత్రమే పరిహారం చెల్లించేలా ఆదేశించారు. తాజాగా వెలువడిన ఈ కేసు తీర్పు వివరాలను పరిశీలిస్తే.. 
 
చెన్ అనే యువతికి, లీకి మధ్య గత 2009లో పరిచయం ఏర్పడింది. ఇది ప్రేమగా మారడంతో వీరిద్దరు డేటింగ్‌లు మొదలు పెట్టారు. 2013లో ఉన్నట్టుండి లీ ప్రియురాలికి దూరంగా ఉండసాగాడు. దీంతో వారిద్దరి మధ్య ఎడబాటు వచ్చింది. ఈ నేపథ్యంలో, ఓ రోజు లీ ఇంటికి వెళ్ళిన చెన్ అక్కడ పరిస్థితిని చూసి నిర్ఘాంతపోయింది. అతడు తన భార్యతో కనిపించేసరికి తాను మోసపోయిన విషయాన్ని గ్రహించింది. 
 
వెంటనే కోర్టులో అతనిపై దావా వేసింది. పెళ్ళి చేసుకుంటానన్న లీ మాటలు నమ్మి, కన్యత్వాన్ని సమర్పించానని, అందుకు నష్ట పరిహారంగా రూ.49 లక్షలు చెల్లించాలని, వైద్య ఖర్చులకు మరో రూ.15 వేలు చెల్లించాలని డిమాండ్ చేసింది. అయితే, కోర్టు చెన్ డిమాండ్ మరీ ఎక్కువగా ఉందంటూ... పరిహారంగా మూడు లక్షల రూపాయలు చెల్లించాలని లీని ఆదేశించింది. కన్యత్వపు హక్కును చట్టం పరిరక్షిస్తుందని కోర్టు స్పష్టం చేసింది.