శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Chakri
Last Modified: శుక్రవారం, 28 జులై 2017 (12:28 IST)

కొత్త పాట పాడుతున్న చైనా... భారత్‌ను అమెరికా రెచ్చగొడుతోంది...

నిన్నటివరకు భారతదేశాన్ని హెచ్చరిస్తూ, యుద్ధానికైనా వెనుకాడేదిలేదంటూ బెదిరిస్తూ వచ్చిన చైనా... ఒక్కసారిగా తన బాణీని మార్చేసింది. సరిహద్దు విషయంలో భారత్ ఒక్క అడుగు కూడా వెనక్కి వేయకపోగా, దేశంలో చైనా ఉత్పత్తుల వాడకాన్ని నిలిపివేయాలనే ప్రచారం ఊపందుకోవడంత

నిన్నటివరకు భారతదేశాన్ని హెచ్చరిస్తూ, యుద్ధానికైనా వెనుకాడేదిలేదంటూ బెదిరిస్తూ వచ్చిన చైనా... ఒక్కసారిగా తన బాణీని మార్చేసింది. సరిహద్దు విషయంలో భారత్ ఒక్క అడుగు కూడా వెనక్కి వేయకపోగా, దేశంలో చైనా ఉత్పత్తుల వాడకాన్ని నిలిపివేయాలనే ప్రచారం ఊపందుకోవడంతో చైనా స్వీయ రక్షణలో పడింది. ఈ క్రమంలో చైనా అధికారిక వార్తా సంస్థ జిన్హువా ప్రధాని నరేంద్ర మోదీని ఆకాశానికెత్తేసింది. భారతదేశంలో మోదీ వాణిజ్య రంగాన్ని బలోపేతం చేసారని, ఆయన అమలు చేస్తున్న బహిరంగ విదేశీ అర్థిక విధానం ప్రశంసనీయమని ప్రశంసల్లో ముంచెత్తేసింది.
 
మోదీ చేపట్టిన సంస్కరణల కారణంగా భారతదేశంలో పెట్టుబడులు పెట్టడానికి అనుకూల వాతావరణం ఏర్పడి, తద్వారా భారత్‌కు అత్యధిక స్థాయిలో విదేశీ పెట్టుబడులు వస్తున్నాయని పేర్కొంది. గడచిన రెండేళ్లలో మోదీ నాయకత్వంలో భారత్ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అత్యధిక స్థాయిలో ఆకర్షించిందని తెలిపింది. అంతేకాకుండా భారత్-చైనా మధ్య వాణిజ్య సహకారాన్ని, బహిరంగ వాణిజ్య విధానాన్ని బలోపేతం చేస్తే, మిగిలిన దేశాలు అమలు చేస్తున్న స్వీయ సంరక్షణ విధానాలకు అడ్డుకట్ట వేయచ్చని అభిప్రాయపడింది.
 
మోదీ నాయకత్వంలో క్రియాశీల విదేశాంగ విధానం అమలు అవుతోందని పేర్కొన్న ఆ పత్రిక భారత్-చైనా ఉద్రిక్తతలను మరింత రెచ్చగొట్టేందుకు అమెరికా, మరికొన్ని దేశాలు ప్రయత్నిస్తున్నాయని ఆరోపణలు చేయడం గమనార్హం.