మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 24 నవంబరు 2016 (10:19 IST)

చైనాలో ఘోర ప్రమాదం: పవర్ ప్లాంట్ కూలి 40 మంది మృతి..?

చైనాలో ఘోర రోడ్డు ప్రమాదంలో మూడు పదులకు పైగా ప్రాణాలు కోల్పోయిన ఘటన మరవకముందే.. చైనాలోని జియాంగ్జి ప్రావిన్స్‌లో గురువారం ఉదయం మరో ఘోర ప్రమాదం చేసుకుంది. నిర్మాణంలో ఉన్న పవర్‌ ప్లాంట్‌ కూలి 44 మంది ప్

చైనాలో ఘోర రోడ్డు ప్రమాదంలో మూడు పదులకు పైగా ప్రాణాలు కోల్పోయిన ఘటన మరవకముందే.. చైనాలోని జియాంగ్జి ప్రావిన్స్‌లో గురువారం ఉదయం మరో ఘోర ప్రమాదం చేసుకుంది. నిర్మాణంలో ఉన్న పవర్‌ ప్లాంట్‌ కూలి 44 మంది ప్రాణాలు కోల్పోయారని అధికారులు అనుమానిస్తున్నారు. పలువురు గాయపడ్డారు. కార్మికులు విధుల్లో ఉన్న సమయంలో ప్లాంట్‌ ఒక్కసారిగాఒక్కసారిగా కుప్పకూలడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. 
 
శిథిలాల కింద చాలామంది చిక్కుకున్నట్లు చైనా న్యూస్ ఏజెన్సీలు వెల్లడించాయి. సహాయ సిబ్బంది శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించే పనిలో నిమగ్నమయ్యారు. సరైన జాగ్రత్తలు తీసుకోకుండా కట్టడాలు నిర్మించడంతో తరుచూ ప్రమాదాలు జరిగి ఎంతో మంది ప్రాణాలను బలిగొంటున్నాయని అధికారులు చెప్తున్నారు. ఆగస్టు నెలలో జరిగిన పైప్‌లైన్‌ పేలుడు కారణంగా 21 మంది మృతి చెందారు. 
 
గతేడాది ఓ ప్లాంట్‌లో రసాయనాలు విడుదల కారణంగా 130 మంది అస్వస్థతకు గురయ్యారు. తాజాగా చైనాలో ప్రమాదాలు అధికమవుతున్నాయని.. తద్వారా మరణాల సంఖ్య కూడా పెరిగిపోతున్నాయని ప్రభుత్వాధికారులు చెప్తున్నారు.