మంగళవారం, 16 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : సోమవారం, 20 ఏప్రియల్ 2015 (15:30 IST)

పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో చైనా విమానాశ్రయం.. భారత్ ఆందోళన!

పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో విమానాశ్రయాన్ని నిర్మించాలని చైనా భావిస్తోంది. దీనిపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. శ్రీలంకలో నౌకాశ్రయాన్ని వాడుకున్న చైనా, తాజాగా పాకిస్థాన్ అధీనంలోని కాశ్మీర్ సరిహద్దులో ఏకంగా విమానాశ్రయాన్నే నిర్మించతలపెట్టింది. పాక్ ఆక్రమిత కాశ్మీర్ సరిహధ్దుకు ఆనుకుని ఉన్న జిన్ జియాంగ్‌లో సముద్ర మట్టానికి 2,480 అడుగుల ఎత్తులో చైనా ఈ విమానాశ్రయాన్ని నిర్మించనుంది. 
 
గత వారం చైనా విమానయాన శాఖాధికారులు జిన్ జియాంగ్‌ను సందర్శించడమే కాక, ఎయిర్ పోర్టు నిర్మాణం చేపట్టనున్న స్థలాన్ని కూడా ఖరారు చేసినట్టు సమాచారం. చైనా తీసుకున్న ఈ నిర్ణయంపై భారత్ ఆందోళన చెందుతోంది. విమానాశ్రయం ఏర్పాటుతో పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో చైనా తన నిర్మాణాలను శాశ్వతం చేసుకునేందుకే ఈ చర్యలు చేపడుతోందని అనుమానిస్తోంది.