శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ivr
Last Modified: శనివారం, 15 ఏప్రియల్ 2017 (21:36 IST)

అణుబాంబు వేస్తే ఉత్తర కొరియా ఉండదు... గోల్ఫ్ ఆడుతూ ట్రంప్... చైనా బిక్కుబిక్కు

ఉత్తర కొరియా హూంకరిస్తోంది. అణు ప్రయోగం చేసి తీరుతామని భీష్మిస్తోంది. ఐతే అణ్వస్త్ర ప్రయోగాలు చేసి తీవ్రమైన ఉద్రక్త పరిస్థితులకు కారణమవుతున్న ఉ.కొరియా పీచమణుస్తామని అమెరికా వార్నింగ్ ఇచ్చింది. ఇప్పటికే కొరియా ద్వీపకల్పంలో అమెరికా దేశ నావికాదళం మోహరిం

ఉత్తర కొరియా హూంకరిస్తోంది. అణు ప్రయోగం చేసి తీరుతామని భీష్మిస్తోంది. ఐతే అణ్వస్త్ర ప్రయోగాలు చేసి తీవ్రమైన ఉద్రక్త పరిస్థితులకు కారణమవుతున్న ఉ.కొరియా పీచమణుస్తామని అమెరికా వార్నింగ్ ఇచ్చింది. ఇప్పటికే కొరియా ద్వీపకల్పంలో అమెరికా దేశ నావికాదళం మోహరింపజేశారు ట్రంప్. పనిలో పనిగా హ్యాపీగా గోల్ఫ్ ఆడుకుంటున్నారు. అంతర్జాతీయ ఆంక్షలను ఎంతమాత్రం పట్టించుకోకుండా ఉ.కొరియా తన ఇష్టం వచ్చినట్లు అణ్వస్త్ర ప్రయోగాలను చేసేందుకు ముందుకెళితే మూల్యం చెల్లించుకోక తప్పదని అమెరికా హెచ్చరించింది.
 
మరోవైపు ఉ.కొరియాకు మిత్రదేశమైన చైనా ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ అణ్వస్త్ర ప్రయోగాలను చేయవద్దని సూచన చేసింది. అంతేకాదు... ఆ దేశానికి విమాన రాకపోకలను నిలిపివేసింది. ఏ క్షణమైనా యుద్ధమొస్తుందనే భయం వ్యక్తం చేస్తోంది. ఉ.కొరియాను దారిలోకి తీసుకుని రావాలంటూ రష్యాను అభ్యర్థించింది. చైనా చైనా విదేశాంగమంత్రి వాంగ్‌ యి శుక్రవారం నాడు రష్యా విదేశాంగమంత్రి సెర్గీ లావ్రోవ్‌తో సమావేశమై ఉద్రిక్తతలపై చర్చించారు.
 
కాగా అమెరికా తమపై దుందుడుకుగా కాలు దువ్వితే దక్షిణ కొరియాపై బాంబులు మోత కురిపిస్తామని ఉ.కొరియా హెచ్చరిస్తోంది. ద.కొరియా సియోల్ నగరం అత్యంత ధనికులు వుండే నగరం. అక్కడే హుండాయ్, శ్యామ్ సంగ్ వంటి బడా సంస్థలు తమ కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయి. అలాంటి వెన్నెముక ప్రాంతాన్ని నాశనం చేసి కసి తీర్చుకుంటామని హెచ్చరిస్తోంది. ఐతే అలాంటి పనికే పూనుకుంటే ఉ.కొరియాపై అమెరికా దాడి చేస్తే ఆ దేశమే లేకుండా పోయే అవకాశం ఉంది. ఏం జరుగుతుందన్న ఆందోళనలో ప్రపంచం వుంది.