గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pyr
Last Updated : సోమవారం, 3 ఆగస్టు 2015 (09:01 IST)

చైనాలో దోమల పరిశ్రమ... ఎందుకు..? దాడి చేయిస్తారా..?

ప్రస్తుతం చైనా దోమలను ఉత్పత్తి చేయడంలో మునిగి తేలుతోంది. దోమలను ఉత్పత్తి చేసే ఫ్యాక్టరీనే నెలకొల్పుతోంది. అక్కడ ఉత్పత్తి అయిన దోమలను జనబాహుళ్యంలోకి వదులుతారు. ఏం ఏందుకు? చైనా జనాభాను తగ్గించుకునే కొత్త ఎత్తులేమైనా చేస్తోందా..? అవును నిజమే.. జనాభాను తగ్గించుకోవడానికే. కానీ మనుషుల జనభా కాదు దోమల జనాభా. డెంగ్యూకి కారణమైన దోమల జనాభాను తగ్గించుకోవడానికి ఈ ప్రయత్నాలు చేస్తోంది. వివరాలిలా ఉన్నాయి. 
 
దోమల కారణంగా వ్యాపించే డెంగ్యూ జ్వరాన్ని ఎదుర్కోవడానికి దోమలనే ఆయుధంగా చేసుకుంటోంది. దోమల సంతతిని తగ్గించడం ద్వారా ప్రజలకు డెంగ్యూవంటి వ్యాధుల నుంచి రక్షణ కల్పించవచ్చునని చైనా భావిస్తోంది. ఈ మేరకు వాటి సంతానోత్పత్తి సామర్థ్యాన్ని నిర్మూలించి, రోగ కారక క్రిములను నశింపజేసి (స్టెరిలైజ్‌) కొత్త తరం దోమల రూపకల్పనకు ఏకంగా ప్రపంచంలోనే అతిపెద్ద పరిశ్రమను ఏర్పాటుచేసింది. 
 
ఇక్కడ స్టెరిలైజ్‌ చేసిన దోమలను ప్రతి వారం 10 లక్షల వంతున విడిచిపెడుతోంది. తొలిసారి ప్రయోగాత్మకంగా ఈ స్టెరిలైజ్‌డ్‌ దోమలను కొన్ని నగరాల్లో విడిచిపెట్టగా వ్యాధికారక దోమలు 90 శాతం అంతరించినట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.