శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By PNR

భారత 'యోగా'తో చైనాకు అసూయ.. 'చీ గాంగ్‌' ప్రాచుర్యానికి యత్నాలు!

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చొరవతో జూన్ 21వ తేదీన నిర్వహించిన వరల్డ్ యోగా డేతో భారత్ పేరు ప్రపంచ వ్యాప్తంగా మార్మోగిపోయింది. దీన్ని భారత్ శత్రుదేశాలైన చైనా, పాకిస్థాన్‌లు జీర్ణించుకోలేక పోతున్నాయి. ప్రపంచ దేశాల్లో చైనా, పాకిస్థాన్ వంటి కొన్ని దేశాలు మినహా ఏకంగా 140 దేశాలు యోగా డేను ఘనంగా నిర్వహించాయి. ఇది పాకిస్థాన్ కంటే చైనాకు అసూయ తెప్పించినట్టుంది.
 
అందుకే మన యోగాకు పోటీగా తమ దేశానికి సొంతమైన 'చీ గాంగ్' ప్రక్రియకు విశేష ప్రాచూర్యం కల్పించేందుకు చర్యలు చేపట్టింది. చీ గాంగ్‌ కూడా మన యోగాలాంటిదే. మనసును, శరీరాన్నీ అనుసంధానించే ప్రక్రియే. ఇందులోనూ యోగా తరహాలోనే శారీరక భంగిమలుంటాయి. మనవి ఆసనాలైతే.. వారివి కుంగ్‌ఫూ భంగిమల తరహాలో ఉంటాయి.
 
యోగాలోలాగానే చీగాంగ్‌లో కూడా శ్వాసనియంత్రణ, ధ్యానం వంటి ప్రక్రియలుంటాయి. మర్దన అదనం. ఈ ప్రక్రియలన్నీ కలిసి మనసును, శరీరాన్ని శుద్ధంగా ఉంచుతాయని చైనీయుల విశ్వాసం. పేరుకు ఇది చీ గాంగే అయినా.. పాశ్చాత్యులు దీన్ని చైనా యోగాగా వ్యవహరిస్తుడడం గమనార్హం. అందుకే దీనికి తిరిగి ప్రాచూర్యం కల్పించేందుకు డ్రాగన్ దేశం సిద్దమైంది.