శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 23 ఫిబ్రవరి 2015 (19:25 IST)

చైనాలో శునకాల పందేలు ఫేమస్.. సిగరెట్ ప్యాకెట్ కోసం..!

చైనాలో శునకాల పందేలు ఫేమస్. సంక్రాంతి అంటే మనకందరికీ కోడి, పొట్టేలు, ఎడ్లబళ్ల పందేలు గుర్తొచ్చేలా.. చైనాలో కొత్త  సంప్రదాయం ఉంది. కానీ కాస్త విభిన్నంగా చైనాలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. ఈ వేడుకల్లో ప్రధానంగా శునకాల పందేలు జరుగుతాయి.
 
శునకాల పందేలంటే, బాక్సింగ్‌లా ఉంటాయి. రెండు కుక్కలను బరిలో వదులుతారు. ఆ రెండు కుక్కలూ కసిదీరా కరుచుకుంటాయి. ఏది విజేతగా నిలుస్తుందో దానికి సిగరెట్ పాకెట్ బహుమతిగా ఇస్తారు. 
 
ఆ సిగరెట్ పాకెట్‌ను ఓడిన వారు గెలిచిన వారికిస్తారు. దానిని వెలిగించి ఇద్దరూ స్నేహం వ్యక్తం చేస్తారు. స్నేహం ముందు, పోటీ తరువాత అనే దృక్పథంతో ఈ పోటీలను నిర్వహిస్తారు. ఈ పోటీలకు చైనాలో భారీ క్రేజ్ ఉంది.