చైనా సైనికులను పరుగుపెట్టించిన ఇండియన్ ఆర్మీ

శుక్రవారం, 5 జనవరి 2018 (10:02 IST)

India, China soldiers

డ్రాగన్ జవాన్లకు భారత ఆర్మీ సరైన గుణపాఠం చెప్పింది. భారత్‌లో అంతర్భాగమైన అరుణాచల్ ప్రదేశ్‌లో అంతర్జాతీయ సరిహద్దునుదాటి చైనా బలగాలు కిలోమీటరు దూరం మేరకు చొచ్చుకొచ్చాయి. ఈ విషయాన్ని గమనించిన భారత బలగాలు చైనా బలగాలను అడ్డుకున్నాయి. భారత్ నుంచి ఊహించని ప్రతిఘటన ఎదురుకావడంతో డ్రాగన్ సైనికులు తోకముడిచి పరుగులు తీశారు. 
 
ఈ ఘటన డిసెంబర్ చివరివారంలో అప్పర్ సయాంగ్ జిల్లాలో జరుగగా, తాజాగా వెలుగులోకి వచ్చింది. అంతర్జాతీయ సరిహద్దును దాటి కిలోమీటరు దూరం వరకు చైనా బలగాలు చొచ్చుకువచ్చాయి. ట్యూటింగ్ ప్రాంతంలో రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాయి. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటనపై భారత్ తీవ్రంగా ప్రతిస్పందించింది. 
 
ఈనేపథ్యంలో తాము అరుణాచల్ ప్రదేశ్‌ను అసలు గుర్తించడమే లేదని, అలాంటప్పుడు తమది చొరబాటు ఎలా అవుతుందని చైనా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి గెంగ్‌షువాంగ్ వితండవాదనకు దిగారు. అయితే భారత సైన్యం బుధవారం ట్యూటింగ్ ప్రాంతానికి వెళ్లి నిర్మాణ సామగ్రిని సీజ్ చేసింది. దీంతో చైనా బృందాలు వెనక్కి వెళ్లిపోయాయి.దీనిపై మరింత చదవండి :  
India Arunachal Pradesh Chinese Road Seizes Equipment Indian Army

Loading comments ...

తెలుగు వార్తలు

news

ఈ జ్యోతి.. మరో స్వాతి.. ప్రియుడితో కలిసి భర్తను చంపేసింది...

తెలంగాణ రాష్ట్రంలో మరో స్వాతి గుట్టు వెలుగు చూసింది. అయితే, ఈమె పేరు స్వాతి కాదు. జ్యోతి. ...

news

వచ్చే ఎన్నికల్లో మచ్చలేని వ్యక్తికే సిఎం పీఠం... చింతా మోహన్(వీడియో)

ఎపిలో వచ్చే ఎన్నికల్లో అధికారాన్ని చూడని వారికి ప్రజలు పట్టం కడుతారని చెప్పారు మాజీ ...

news

బాబోయ్ పోలీసులు... యాంకర్ ప్రదీప్ పారిపోయాడా?

ఇదివరకు పోలీసు దుస్తుల్లో ఎవరయినా వ్యక్తి ఇంటి వైపు వస్తుంటే బెంబేలెత్తిపోయేవారు. ...

news

అమెరికా మీడియాకు ట్రంప్ 'చెత్త' అవార్డు... అవాక్కవుతున్న జర్నలిస్టులు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్విట్టర్‌లో మళ్లీ ఫైర్ అయ్యారు. అయితే ఈసారి ఏదో ఒక ...