Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

పిచ్చి పీక్స్‌కు.. ఇళ్ళు కాళుతుంటే భార్యాభర్తల సెల్ఫీ... ఎక్కడ..?

బుధవారం, 17 జనవరి 2018 (09:01 IST)

Widgets Magazine
selfie

సెల్ఫీ పిచ్చి అంతా ఇంతా కాదు. సెల్ఫీ వల్ల ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. సెల్ఫీ మొబైళ్లు అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి యువకులు ఎక్కువగా ప్రాణాలను కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఏం జరిగినా సరే సెల్ఫీ తీసుకోవడం మాత్రం జనం మానడం లేదు. కొంతమందైతే విచిత్ర దోరణిలో ప్రవర్తిస్తున్నారు. వారి సెల్ఫీ పిచ్చి కాస్త పీక్స్‌కు చేరిందనే చెప్పొచ్చు. అలాంటి ఘటనే దక్షిణ చైనాలో జరిగింది.
 
దక్షిణ చైనాలోని గుయోలిన్ ప్రాంతానికి చెందిన నమయూన్, కార్తాలు తమ ఇళ్ళు కాలిపోతుంటే సెల్ఫీ దిగారు. ప్రమాదవశాత్తు షార్ట్ షర్క్యూట్ అయి ఇళ్ళు తగలబడింది. ఇళ్ళు కాలుతున్న సమయంలో నమయూన్ బాత్ రూంలో ఉన్నాడు. కార్తా బెడ్ రూంలో ఉంది. హాల్లో నుంచి మంటలు చెలరేగి దట్టంగా వ్యాపించాయి. నమయూన్ బయటకు వచ్చే లోపే సగానికి పైగా ఇల్లు కాలిపోయింది. 
 
అయితే వీరిద్దరు ఏ మాత్రం భాదపడలేదు. ఆందోళన చెందలేదు. తగలబడుతున్న ఇంటి ముందు నిలబడి ఓ సెల్ఫీ తీసి ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్ చేశారు. దానికింద మా ఇళ్ళు కాలిపోయిందంటూ ఓ కామెంట్ పెట్టారు. దీంతో ఆ ఫోటో కాస్త వైరల్‌గా మారింది. గంటలోనే 10 లక్షల మంది ఆ ఫోటోను చూసి రకరకాల కామెంట్స్ పెట్టారు. కొంతమంది తమాషా దంపతులని, మరికొందరైతే విచిత్రపు మనుషులని, ఇంకొందరైతే ఇన్సూరెన్స్ కోసం ఇలా చేశారంటూ మెసేజ్‌లు పెట్టారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Selfie Fire Home Chirpy Chinese Couple

Loading comments ...

తెలుగు వార్తలు

news

ప్రయాణీకుడికి సారీ చెప్పిన ఎపి సిఎం చంద్రబాబు నాయుడు

తనవల్ల ఇబ్బందిపడ్డ ఓ సామాన్య వ్యక్తికి సీఎం సారి చెప్పిన ఘటన చిత్తూరు జిల్లాలో ...

news

పెద్దనోట్ల రద్దు... 12 వేల ఎకరాలు కొన్న శశికళ?

ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 5 వేల కోట్ల పన్ను ఎగవేతతో దేశంలోనే మొదటగా ఉన్నారు జైలు ...

news

మనవడు దేవాన్ష్‌తో తాతయ్య బాలయ్య కుంగ్‌ఫూ, ఎడ్లబండిపై షికారు (వీడియో)

సంక్రాంతి వేడుకలను నందమూరి బాలక్రిష్ణ చిత్తూరు జిల్లా నారావారిపల్లిలో జరుపుకున్నారు. ఎపి ...

news

జగన్ మోహన్ రెడ్డి పాదయాత్రలో పాల్గొంటా... నటుడు సూర్య

హీరోహీరోయిన్లు ఎప్పుడు ఏ రాజకీయ నాయకుడికి మద్దతు తెలుపుతారో అస్సలు అర్థం కాదు. కొంతమంది ...

Widgets Magazine