గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 2 ఏప్రియల్ 2017 (17:06 IST)

కొలంబియాలో తుపాను బీభత్సం... ఎటు చూసినా శవాల గుట్టలే

కొలంబియాలో తుపాను బీభత్సం సృష్టించింది. తుపాను కారణంగా ఇప్పటివరకు 254 మంది మృత్యువాతపడ్డారు. వరదల కారణంగా జరిగిన ప్రమాదాల్లో 400 మంది గాయపడ్డారు. మరో 200 మంది గల్లంతయ్యారు. ఈ తుపాను ధాటికి కొలంబియాలోన

కొలంబియాలో తుపాను బీభత్సం సృష్టించింది. తుపాను కారణంగా ఇప్పటివరకు 254 మంది మృత్యువాతపడ్డారు. వరదల కారణంగా జరిగిన ప్రమాదాల్లో 400 మంది గాయపడ్డారు. మరో 200 మంది గల్లంతయ్యారు. ఈ తుపాను ధాటికి కొలంబియాలోని మొకొవా నగరం పూర్తిగా మునిగిపోయింది. 
 
పుటుమాయో ప్రావిన్స్‌లో కొండచరియలు విరిగి భవనాలపై పడ్డాయి. వాహనాలన్నీ బురదలో ఇరుక్కుపోయాయి. మొకొవాలోని 345,000 మంది జనాభాని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కొలంబియా అధ్యక్షుడు జువాన్‌ మాన్యుల్‌ అధికారులను ఆదేశించారు. దేశంలో అత్యవసర పరిస్థితిని విధించారు. దాదాపు 1,100 మంది జవాన్లు గల్లంతైనవారి కోసం గాలింపులు చర్యలు చేపడుతున్నారు. మొకావో మేయర్‌ జోస్‌ అంటోనియో కూడా ఇల్లు కోల్పోయారు.
 
క్షతగాత్రుల సంఖ్య పెరుగుతోంది. దీంతో వైద్యులు రాత్రి పగలు అనే తేడాలేకుండా వైద్యం చేస్తూనే ఉన్నారు. చాలా మందికి రక్తం ఎక్కించాల్సి ఉంది కానీ ఆస్పత్రిలో బ్లడ్‌ బ్యాంక్‌ లేకపోవడంతో చాలా మందికి వైద్యం ఆలస్యమవుతోంది. కాగా, కొలంబియాలో 1985లో వచ్చిన తుపాను బీభత్సం మర్చిపోలేనిది. అప్పట్లో వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడి 20,000 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెల్సిందే.