Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

కాన్ఫరెన్స్ హాల్‌లో డొనాల్ట్ ట్రంప్ లైంగిక ఆరోపణలను ప్రస్తావించారు: జేమ్స్‌ కోమీ

శుక్రవారం, 9 జూన్ 2017 (08:45 IST)

Widgets Magazine
donald trump

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు చుక్కెదురైంది. వీసాల నిషేధం, అవుట్ సోర్సింగ్ కట్ వంటి అంశాలతో ప్రపంచ దేశాలను ముప్పు తిప్పలు పెడుతున్న ట్రంప్‌కు షాక్ తగిలింది. మాజీ జాతీయ భద్రతా సలహాదారు (ఎన్‌ఎస్‌ఏ) మైకేల్‌ ఫ్లిన్‌కు రష్యాతో లింకులున్నాయన్న ఆరోపణలపై జరుగుతున్న దర్యాప్తును ఆపివేయాలని అధ్యక్షుడు తనను అడిగారని ఎఫ్‌బీఐ మాజీ డైరెక్టర్‌ జేమ్స్‌ కోమీ బాంబు పేల్చారు. ఈ మేరకు సెనేట్‌ నిఘా వ్యవహారాల కమిటీకి లిఖితపూర్వక వాంగ్మూలం సమర్పించారు. 
 
దీంతో డొనాల్డ్ ట్రంప్‌పై విపక్ష డెమోక్రాట్లు ఫైర్ అవుతున్నారు.  శుక్రవారం సెనేట్ కమిటీ విచారణ జరుగనుండగా, ఆయనిచ్చిన ఏడు పేజీల వాంగ్మూలాన్ని ఓ రోజు ముందు కమిటీ విడుదల చేయడం గమనార్హం. గత జనవరి 27న వైట్ హౌస్ గ్రీన్ రూమ్‌లో డొనాల్డ్ ట్రంప్‌తో పాటు తాను ప్రైవేట్ డిన్నర్‌కు హాజరైనట్లు కోమీ వాంగ్మూలంలో వెల్లడించారు.
 
ఈ సందర్భంగా జేమ్స్ ట్రంప్‌పై ఆరోపణల గుప్పించారు. తనను విధుల నుంచి తొలగించే వరకూ ట్రంప్ తనను ఏ రకంగా లక్ష్యం చేసుకున్నదీ సెనెట్ ఇంటెలిజెన్స్ కమిటీకి వివరించారు. మొత్తం ఏడు పేజీల సాక్ష్యాన్ని సమర్పించారు. మైక్ ఫ్లైన్ పై కేసును వదిలివేయాలని ట్రంప్ కోరారని, రష్యా జోక్యంపై దర్యాప్తును ఓ మేఘంతో ట్రంప్ పోల్చారని అన్నారు. అప్పటికే తాను ట్రంప్ దర్యాప్తు పరిధిలోకి రాననే విషయాన్ని మూడుసార్లు ఆయనకు చెప్పినట్టు పేర్కొన్నారు.
 
ఈ ఏడాది జనవరి 6న ట్రంప్‌ను తొలిసారిగా ట్రంప్ టవర్స్‌లోని కాన్ఫరెన్స్ హాల్‌లో కలిసి, ఆయనపై వచ్చిన లైంగిక, ఇతర ఆరోపణల విషయాలను ప్రస్తావించినట్టు తెలిపారు. జనవరి 27న వన్ టు వన్ డిన్నర్‌లో మరోమారు ట్రంప్‌ను కలిసిన సందర్భంలో ఆయన నుంచి దిగజారిన సంభాషణ వినాల్సి వచ్చిందని ఏడు పేజీల సాక్ష్యంలో పేర్కొన్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

నాసా వ్యోమగాముల్లో భారత సంతతి వ్యక్తి.. 18,300 మంది దరఖాస్తు.. 12 మంది ఎంపిక

నాసా త్వరలో చేపట్టనున్న అంతరిక్ష ప్రయోగానికి ఎంపికైన 12 మంది వ్యోమగాముల్లో భారత్‌ సంతతికి ...

news

కోచింగ్ సెంటర్లను నమ్మొద్దు. మీ సొంత శ్రమనే నమ్ముకోండి: సివిల్స్ 3వ ర్యాంకర్ గోపాలకృష్ణ

సివిల్స్‌కు సిద్ధమవుతున్న యువత తన పేరును, ఫొటోను ప్రచారం చేసుకుంటున్న కోచింగ్‌ సెంటర్లకు ...

news

ట్రంప్‍‌ నెత్తిన పిడుగు.. అధ్యక్ష ఎన్నికల్లో రష్యా హస్తం ఉందన్న ఎఫ్‌బీఐ మాజీ డైరెక్టర్‌ కోమీ

అమెరికా అధ్యక్ష పదవిలో ఉన్న డొనాల్డ్ ట్రంప్ పుచ్చె పగిలిపోయే పరిణామం జరిగిపోయింది. ...

news

తమిళ రాజకీయాల్లో విజయశాంతి ఎంట్రీ.. శశికళతో భేటీతో మళ్లీ మొదలైన కెరీర్‌

అందరికీ అర్థమయ్యాయి. ఒకప్పటి లేడీ సూపర్ స్టార్ విజయశాంతి ఇప్పుడు శశికళ వర్గం ...

Widgets Magazine