శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By chitra
Last Updated : మంగళవారం, 28 జూన్ 2016 (13:14 IST)

28 యేళ్ళ వ్యక్తి - 18 యేళ్ల యువతి.. రోడ్డుపైనే శృంగారం... వాహనచోదకులకు షాక్...

రానురాను జంతువులకు కొందరు మనుషులకు తేడా లేకుండా పోతుంది. రోడ్డు మీద కుక్కలు చేసే పనులను కొంతమంది మనుషులు కూడా చేసే పరిస్థితి దాపురిస్తోంది. జంతువులు ఎక్కడ పడితే అక్కడ శృంగారం చేసుకుంటూ ఉంటాయి. మనుషులక

రానురాను జంతువులకు కొందరు మనుషులకు తేడా లేకుండా పోతుంది. రోడ్డు మీద కుక్కలు చేసే పనులను కొంతమంది మనుషులు కూడా చేసే పరిస్థితి దాపురిస్తోంది. జంతువులు ఎక్కడ పడితే అక్కడ శృంగారం చేసుకుంటూ ఉంటాయి. మనుషులకు మాత్రం ఇది మినహాయింపు. వీరు కూడా జంతువులే అయినప్పటికీ సిగ్గు, బిడియం, సమాజంలో కట్టుబాట్లు అనుసరించి నడుస్తారు. కానీ కొంతమంది మాత్రం వీటిని తోసిరాజని బహిరంగంగానే ముద్దులు పెట్టుకోవడం, ఒకరిపై ఒకరు పడిపోవడం, కౌగలింతలతో పాటు ఏకంగా శృంగార కార్యక్రమం సైతం చేసేస్తూ చూసేవారికి జుగుప్స కలిగిస్తున్నారు.
 
ఇంతకీ అసలు సంగతి ఏంటయా అంటే... మద్యం మత్తులో ఓ జంట విచ్చలవిడి శృంగారంతో రెచ్చిపోయింది. 28 ఏళ్ల యువకుడు 18 ఏళ్ల వయసున్న ఓ యువతి అందరూ చూస్తున్నారన్న ఇంగితజ్ఞానం కూడా లేకుండా కామంతో కళ్లు మూసుకుపోయి ఎంతో రద్దీగా ఉండే కైసర్లీ బ్రిడ్జ్ ఎక్కి మరీ శృంగారంలో పాల్గొన్నారు. ఇంకేముంది బ్రిడ్జ్కు రెండు వైపుల నుంచి వచ్చే వాహనదారులు షాక్‌కు గురయ్యారు.
 
ఈ కామకేళిని చూడలేక కొందరు కళ్లుమూసుకోగా మరికొందరు... అంటే అలాంటి మనస్తత్వం కలిగినవారు అక్కడే నిలబడి దాన్ని వేడుకగా చూడటం మొదలుపెట్టారు. దానితో అక్కడ పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామైంది. ఈ ఘటన జర్మనీలోని ఫ్రాంక్ఫర్ట్లో చోటుచేసుకుంది. కైసర్లీ బ్రిడ్జ్కు ఇరువైపులా రెండు ఆర్చ్లు ఉన్నాయి. ఓ ఆర్చ్ను ఎక్కిన వారు శిఖరానికి చేరుకుని ఆ తర్వాత ముందుగా చుట్టుపక్కల ఉన్న అందమైన దృశ్యాలను చూశారు. అనంతరం మద్యం మత్తులో రాసలీలలో మునిగిపోయారు. 
 
శృంగారంలో ఒళ్లు మరిచి, లోకాన్నిమరిచి శృంగార సాగరంలో మునిగిపోయిన ఆ జంట ఎక్కడ కిందపడతారేమే అని వాహనదారులు పోలీసులకు సమాచారం అందిచడంతో.. హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని బ్రిడ్జ్ రెండు వైపులా ముసివేశారు. తాగిన మత్తులో ఉన్న ఆ జంటను ఫైరింజన్ సాయంతో కిందకు దింపి, ట్రాఫిక్ క్లియర్ చేశారు. మళ్లీ ఇలాంటి ఘటనలు పునారావృతమైతే కఠినచర్యలు తప్పవని వారిని పోలీసులు హెచ్చరించారు.