శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 27 ఆగస్టు 2015 (16:00 IST)

మొత్తం 12 కేసులు.. యూసఫ్ రజానీకి చిక్కులు.. అరెస్ట్ చేయాలంటూ..?

పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ బెనజీర్ భుట్టో కేసులో పాక్‌ను వదిలి వెళ్లకూడదనే నిబంధనతో స్వదేశంలోనే ఉంటున్న నేపథ్యంలో.. ఆ దేశ మాజీ ప్రధాని యూసఫ్ రజా గిలానీ కూడా మళ్లీ చిక్కులు కొనితెచ్చుకున్నారు. కొన్ని వేల కోట్ల రూపాయల స్కామ్‌లకు సంబంధించి నమోదైన 12 కేసుల్లో.. గిలానీపై ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన కోర్టు గిలానీని అరెస్ట్ చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. 
 
గిలానీని వెంటనే అరెస్ట్ చేయాలని నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసిన యాంటీ-కరప్షన్ ఫెడరల్ కోర్టు.. గిలానీతో పాటు పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ నేత మఖ్దూమ్ అమిన్ ఫహిమ్‌ను కూడా అరెస్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అంతేగాకుండా విచారణకు సెప్టెంబర్ 10వ తేదీకి కోర్టు వాయిదా వేసింది. ఆ రోజున ఈ కేసుకు సంబంధించిన వివరాలను కోర్టుకు సమర్పించాల్సిందిగా పేర్కొంది.