మంగళవారం, 19 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 1 డిశెంబరు 2016 (10:06 IST)

ఏ నిమిషానికి ఏమి జరుగునో.. ఎవరూహించెదరు... బ్రెజిల్‌ ఫుట్‌‌బాల్‌ క్రీడాకారుల విషాద ఘటన

తీవ్ర విషాదాన్ని నింపిన బ్రెజిల్‌ ఫుట్‌‌బాల్‌ క్రీడాకారుల ఆకస్మిక మరణంతో యావత్ ప్రపంచ క్రీడాకారులు సైతం తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఉత్సాహంతో ఉరకలెత్తుతూ బయలుదేరిన బ్రెజిల్ ఫుట్‌బాల్ క్రీడాకారులు అ

తీవ్ర విషాదాన్ని నింపిన బ్రెజిల్‌ ఫుట్‌‌బాల్‌ క్రీడాకారుల ఆకస్మిక మరణంతో యావత్ ప్రపంచ క్రీడాకారులు సైతం తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఉత్సాహంతో ఉరకలెత్తుతూ బయలుదేరిన బ్రెజిల్ ఫుట్‌బాల్ క్రీడాకారులు అంతలోనే అసువులు బాయడం పెను విషాదాన్ని నింపింది. 
 
కొలంబియాలో జరుగుతున్న కోపా సుడామెరికా ఫైనల్స్‌లో పాల్గొనేందుకు విమానం ఎక్కడానికి ముందు ఫుట్‌బాల్ టీం సంతోషంగా తీసుకున్న ఫోటోలు చూసి మృతుల బంధువులు, సన్నిహితులు బావురుమన్నారు. 'ఏ నిమిషానికి ఏమి జరుగునో.. ఎవరూహించెదరు..' అన్నట్టుగా వారి సంతోష క్షణాలతో నిండిన ఫోటోలు మరింత విషాదాన్ని నింపాయి. అలాగే ఫైనల్‌కు చేరిన సందర్భంగా టీం ఆనందంగా గడిపిన వీడియో ఒకటి నెట్‌లో ఎక్కువగా షేర్ అవుతోంది. 
 
ఆ దేశ విమానయాన శాఖ అందించిన సమాచారం ప్రకారం ఈ విమానంలో తొమ్మిదిమంది విమాన సిబ్బంది సహా ఇతర కోచ్‌లు, ముఖ్య అతిధులు, జర్నలిస్టులు మొత్తం 81 మంది ఉన్నారు. సీపీ 2933 అనే ఈ చార్టెడ్‌ విమానం కొలంబియా నగరం వెలుపల ఉన్న పర్వత ప్రాంతాల్లో కూలిపోయింది. ఈ ప్రమాదంలో మొత్తం టీం ప్రాణాలు కోల్పోగా, ముగ్గురు సాకర్ టీం సభ్యులు, ఇద్దరు విమాన సిబ్బంది, ఒక జర్నలిస్టు ప్రాణాలతో బయటపడ్డారు. మరోవైపు బ్లాక్ బాక్స్‌లో వాయిస్ రికార్డర్‌లో ఇంధనం అయిపోయిందన్న పైలట్ మాటలను గుర్తించినట్టు బీబీసీ రిపోర్ట్ చేసింది.