బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By chitra
Last Updated : మంగళవారం, 24 మే 2016 (11:47 IST)

సెకండ్ హ్యాండ్ కారు కొని సమంతాకు కానుకగా ఇచ్చిన కామెరాన్.. నిజమా?!

బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరాన్ తన భార్య సమంతాకు గిఫ్ట్ ఇచ్చేందుకు సెకండ్ హ్యాండ్ కారు కొని అందరిని అబ్బురపరిచాడు. వినూత్నమైన పంథా అనుసరిస్తూ, ప్రజల్లో కలిసిపోయే ప్రధాని డేవిడ్ కామెరాన్ సొంత నియోజకవర్గం మినిస్టర్ లోవెల్లోని ఓ సెకండ్ హ్యాండ్ కార్ల దుకాణంలో నిస్సాన్ మైక్రా బ్లూకారు 2004 మోడల్ కారును చూశారు. అది తనకు బాగా నచ్చడంతో దానిని తన భార్యకు గిఫ్ట్‌గా ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. దీంతో 1,495 ఫౌండ్లు చెల్లించి ఆ కారుని కొనుగోలు చేశారు.
 
ఈ విషయంపై సెకెండ్ హ్యాండ్ కార్ల దుకాణం యజమాని మాట్లాడుతూ.. తనకు ఒక ఫోన్ వచ్చిందని తన షాపులోని కారును చూసేందుకు ప్రధాని కామెరాన్ వస్తున్నారని చెప్పారు. అయితే తన స్నేహితులు ఎవరో తనని ఆటపట్టించేందుకు ఇలా ఫోన్ చేశారని భావించానని తెలిపారు. ఫోన్‌లో చెప్పినట్టే ప్రధాని కామెరాన్ రావడాన్ని చూసి నివ్వెరపోయానని తెలిపారు. ఆయన సాదాసీదా మనిషిలా వచ్చి కారుని తదేకంగా చూసి, దాని గురించి వివరాలు తెలుసుకొని కొనుగోలు చేశారని ఆ షాపు యజమాని తెలిపారు.