శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 27 నవంబరు 2015 (10:11 IST)

ఇస్లామిక్ స్టేట్‌ ఉగ్రవాదులపై వైమానిక దాడులు చేయాల్సిందే : కామెరూన్

ఇస్లామిక్ సేట్టే ఉగ్రవాదులపై వైమానిక దాడులు చేయాల్సిందేనని బ్రిటన్ ప్రధానమంత్రి డేవిడ్ కామెరూన్ అభిప్రాయపడ్డారు. ఈ దాడుల్లో బ్రిటన్ కూడా భాగస్వామి కావాలని ఆయన చెప్పుకొచ్చారు. ఫ్రాన్స్ రాజధాని పారిస్‌పై ఐఎస్ ఉగ్రవాదులు దాడి చేసి మారణహోమం సృష్టించిన విషయం తెల్సిందే. దీంతో ఫ్రాన్స్‌తో పాటు.. తమ విమానాన్ని పేల్చివేసినందుకు ప్రతీకారంగా రష్యా కూడా సిరియాలోని ఐఎస్ స్థావరాలపై ముమ్మరంగా దాడులు చేస్తోంది. ఈ దాడులకు అనేక దేశాలు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. 
 
ఈ నేపథ్యంలో ఈ దాడుల్లో బ్రిటన్ కూడా భాగస్వామి కావాలని కామెరూన్ చెప్పుకొచ్చారు. సిరియాలో ఐఎస్‌ ఉగ్రవాదులపై దాడుల్లో బ్రిటన్‌ కూడా తప్పక పాల్గొనాల్సిందే అని శుక్రవారం ఎంపీలకు కామెరూన్‌ రాతపూర్వకంగా వెల్లడించారు. సిరియాలో ఉగ్రవాదులపై బ్రిటిష్‌ వైమానికదాడులు పెంచే విషయంపై నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఇదేనన్నారు. ఉగ్రవాదులపై పోరాటం బ్రిటన్‌ జాతీయ భద్రత కోసమన్నారు.  సిరియాలో ఉగ్రస్థావరాలపై వైమానిక దాడుల అంశంపై పార్లమెంట్‌లో ఓటింగ్‌ పెట్టనున్నారు. దీనికి ఎంపీలు మద్దతివ్వాలని కామెరూన్‌ కోరారు.