మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 13 అక్టోబరు 2015 (18:13 IST)

ఇంట్లోకి దొంగలు పడ్డారనుకున్నాడు.. భార్యనే కాల్చేశాడు.. ఎక్కడ..?

విదేశాల్లో గన్ కల్చర్ పెరిగిపోతోంది. ఇంట్లోకి దొంగలు పడ్డారనుకున్న ఓ వ్యక్తి పొరపడి తన భార్యనే కాల్చేశాడు. ఈ ఘటన అమెరికాలో చోటుచేసుకుంది. అమెరికాలోని టెక్సాస్ పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. శాన్ ఆంటోనియో ప్రాంత నివాసి డెబోరా కెల్లీ, నేషనల్ సర్జికల్ హెల్త్ కేర్ వైస్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
 
కెల్లీ భర్త లార్స్ ఇజో వ్యాపారి. ఆదివారం తెల్లవారుజామున తన ఇంటి బయట ఏవో శబ్దాలు వినపడటంతో లార్స్ గమనించాడు. దూరం నుంచి చూస్తే, చీకట్లో ఎవరో తలుపులు తీసేందుకు యత్నిస్తున్నట్లు కనిపించడంతో దొంగలు పడ్డారని భావించాడు. అంతే తన తుపాకీతో కాల్పులు జరిపేశాడు. ఆపై కాల్పులతో హతమైన వారు ఎవరా అని దగ్గరకెళ్లి చూసిన లార్స్.. తను కాల్పులు జరిపింది భార్యపైనేనని తెలుసుకుని షాక్ తిన్నాడు.