శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By మోహన్
Last Updated : బుధవారం, 20 మార్చి 2019 (15:44 IST)

సముద్రం ఒడ్డున నిలబడి ఫోజిచ్చింది.. భారీ అలలు వచ్చి లేపేశాయి..

మనలో చాలామంది సముద్ర ఒడ్డున నిలుచుని ఫోటోలు తీసుకుంటాం, అలలతో ఆట్లాడుకుంటాము. ఒక్కోసారి అలల తీవ్రత ఎక్కువగా ఉంటుంది. అలాంటి సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకుంటే అదే అలలే మన పాలిట రాక్షస అలలుగా పరిణమిస్తాయి. ఇలాంటి ఘటనే ఒకటి ఇండోనేషియాలోని నుసా లెంబోన్గాన్ అనే ఐలాండ్‌లో ఉన్న డెవిల్స్ టియర్ వద్ద చోటు చేసుకుంది. 
 
ఓ యువతి సముద్రం పక్కన ఉన్న కొండ మీదకి వెళ్లి ఫోటోకు ఫోజిచ్చింది. ఇంతలోనే వెనుకనుండి ఓ పెద్ద రాకాసి అల వచ్చి తనను ఢీకొట్టింది. దీంతో ఆ యువతి ఒక్కసారిగా ఎగిరి పడిపోయింది. డెవిల్స్ టియర్ అనేది ఇండోనేషియాలో బెస్ట్ టూరిస్ట్ స్పాట్. చాలా మంది టూరిస్ట్‌లు నిత్యం అక్కడకు వస్తుంటారు. అక్కడ ఫోటోలకు ఫోజులిస్తూ, ప్రకృతి అందాలను తమ కెమరాల్లో బంధిస్తుంటారు. 
 
భారీ అలలు వస్తున్నప్పుడు మాత్రం పర్యాటకులు కాస్తంత దూరంగా పరిగెడతారు. ఈ అమ్మాయి మాత్రం వెనుకనుండి వచ్చిన భారీ అలను గమనించకపోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ అమ్మాయి కాస్త వెనుకకు చూసి ఉంటే ప్రమాదం తప్పేదని నెటిజన్లు కామెంట్‌లు చేస్తున్నారు.