శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : శనివారం, 20 డిశెంబరు 2014 (13:13 IST)

మరో వివాదంలో దేవయాని ఖోబ్రగడే : విదేశాంగ శాఖ కన్నెర్ర!

భారత దౌత్యవేత్త, ఐఎఫ్ఎస్ అధికారిణి దేవయాని ఖోబ్రగడే తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు. తన భర్తకు అమెరికా పౌరసత్వం ఉందని, తన ఇద్దరు పిల్లలు కూడా పౌరసత్వం పొందినట్టు మీడియాకు వ్యక్తిగత విషయాలు వెల్లడించడంతో విదేశాంగ శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. 
 
దాంతో, అమెపై విజిలెన్స్ కేసు నమోదు చేసి తాజాగా విధుల నుంచి తొలగించి పక్కన బెట్టింది. శుక్రవారం వరకు దేవయాని భారత విదేశాంగ శాఖలో అభివృద్ధి భాగస్వామ్య డివిజన్‌లో డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తూ వచ్చిన విషయ తెల్సిందే. మరోవైపు ఈ కేసులో శాఖాపరంగా విచారణ కొనసాగనుంది. 
 
వాస్తవానికి గత యేడాది ఆమె పట్ల అమెరికా సర్కారు వ్యవహరించిన తీరుతో ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైన విషయం తెల్సిందే. తన పని మనిషి కోసం వీసా దరఖాస్తులో దేవయాని తప్పుడు డిక్లరేషన్ ఇచ్చినట్టు ఆరోపణలు ఎదుర్కొన్నారు. దాంతో అభియోగాలు నమోదు చేసిన యూఎస్ పోలీసులు ఆమెను అరెస్టు చేయడం, అనంతరం అక్కడి నుంచి దేవయాని భారత్ చేరుకున్న విషయం తెల్సిందే.