Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

లేబర్ వార్డు నుంచి వెళ్లి పేషెంట్‌కు పురుడు పోసిన వైద్యురాలు.. ఎక్కడో తెలుసా?

మంగళవారం, 1 ఆగస్టు 2017 (16:19 IST)

Widgets Magazine

అమెరికా వైద్యురాలికి సోషల్ మీడియా బ్రహ్మరథం పడుతోంది. ఇంతకీ ఆమె ఏం చేసిందని తెలిస్తే షాక్ అవుతారు. తాను గర్భవతి అయినప్పటికీ.. ప్రసవం కోసం లేబర్ వార్డుకు వెళ్తున్నా.. తన పేషెంట్ అదే ఆస్పత్రిలో చేరిందని.. ఆమె బిడ్డ ప్రాణాలకు అపాయమని తెలుసుకుని.. పురిటి నొప్పితోనే చికిత్స అందించింది.  ఈ క్రమంలో తన ప్రసవాన్ని ఆపేసి.. వేరే మహిళకు పురుడు పోసింది. 
 
ఈ ఘటన అమెరికాలోని కెంటుకి రాజధాని ఫ్రాంక్‌ఫోర్ట్‌‌లో చోటు చేసుకుంది. ఫ్రాంక్‌ఫోర్ట్‌ రీజినల్‌ మెడికల్‌ సెంటర్‌లో హాలిడే జాన్సన్‌ అనే మహిళ ప్రసవం కోసం చేరారు. ఇదే ఆస్పత్రిలో హాలిడేకు వైద్యం అందించి వైద్య పరీక్షలు చేసిన వైద్యురాలు డాక్టర్ అమందా హెస్ కూడా ప్రసవం కోసం అదే ఆస్పత్రిలో చేరారు. అక్కడి వైద్యులు అమందాకు పురుడు పోసేందుకు తయారీ చేసి ఆమెను లేబర్ వార్డుకు తరలించారు.
 
కానీ ఇంతలో తన వద్ద చికిత్స తీసుకున్న హాలిడే కూడా అదే ఆస్పత్రిలో ఉన్నట్లు.. ఆమె ప్రసవించే సమయంలో బిడ్డకు పేగు మెడకు చుట్టుకొని డెలివరి కష్టమైందని తెలియవచ్చింది. వెంటనే ఆమె తన ప్రాణాన్ని తన కడుపులో పెరుగుతున్న బిడ్డ ప్రాణాలని సైతం లెక్క చేయకుండా.. డెలివరీ కోసం ధరించిన గౌనులోకి హాలిడేను ఉంచిన లేబర్ వార్డుకు అమందా వెళ్లింది. హాలిడేకు సరైన విధంగా చికిత్స అందించి ఆమెకు పురుడు పోసింది. దీంతో హాలిడే పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం అమందాను లేబర్ వార్డుకు తీసుకెళ్లిన వైద్యులు ఆమెకు చికిత్స అందించారు. అమందా కూడా పండంటి పాపాయికి జన్మనిచ్చింది. 
 
లేబర్‌ గది నుంచి వచ్చి తనకు డెలివరీ చేసిన విషయం తెలుసుకొని హాలిడే భావోద్వేగానికి గురైంది. తనకు తన బిడ్డకు ప్రాణదానం చేసిందని ప్రశంసలతో ముంచెత్తింది. అలాగే ఆస్పత్రి సిబ్బంది మాత్రమే కాకుండా సోషల్‌ మీడియాలో నెటిజన్లు సైతం ఆమందపై ప్రశంసలు కురిపిస్తున్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

పవన్ పదేపదే చిరుని అలా ఎందుకంటున్నారు? తిరిగి చిరు అలా అంటే?

ఎంతటివారైనా నోరు జారడం మామూలే. పెద్దపెద్దవాళ్లే నోరు జారి తిప్పలు తెచ్చుకున్నారు చాలా ...

news

తల్లి కళ్ల ముందే.. బాలికపై గ్యాంగ్ రేప్.. ఆపై గుండుతీసి పారిపోయారు.. ఎక్కడ?

చిన్నారులపై అకృత్యాలు పెరిగిపోతున్నాయి. తాజాగా బంగ్లాదేశ్‌లో 16 ఏళ్ల బాలికపై... నలుగురు ...

news

ఇప్పటికింతే సర్దుకుపోండి.. అసెంబ్లీ సీట్ల సంఖ్యను పెంచలేం.. హాన్స్‌రాజ్

రాష్ట్రవిభజన అనంతరం రెండు తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల సంఖ్యను పెంచాలని ఇరు ...

news

తెలుగు రాష్ట్రాలకు డిగ్గీరాజా పీడవిరగడైంది... తెలంగాణ ఇన్‌చార్జ్‌గా కుంతియా

ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, మధ్యప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ అలియాస్ ...

Widgets Magazine