శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By chitra
Last Updated : గురువారం, 29 సెప్టెంబరు 2016 (14:04 IST)

పిల్లుల లాలాజలం, ఓడ్కా మిశ్రమంతో చిన్నారులకు వేసే టీకాల తయారీ

టీకా అనేది ఒక నివారణ మందు. వ్యాధి కారకం శరీరంలోకి చేరకముందే దీన్ని ఇవ్వడం ద్వారా భవిష్యత్‌లో సంక్రమించే అవకాశమున్న వ్యాధికారక నిరోధాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసుకోవచ్చు. కేవలం చిన్న పిల్లలే కాకుం

టీకా అనేది ఒక నివారణ మందు. వ్యాధి కారకం శరీరంలోకి చేరకముందే దీన్ని ఇవ్వడం ద్వారా భవిష్యత్‌లో సంక్రమించే అవకాశమున్న వ్యాధికారక నిరోధాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసుకోవచ్చు. కేవలం చిన్న పిల్లలే కాకుండా పెద్దలు కూడా వేయించుకునే టీకాలు ఉన్నాయి. పిల్లల కోసం తయారు చేసే టీకాలను ఓ వైద్యుడు దేనితో తయారు చేశాడో తెలిస్తే ముక్కున వేలేసుకుంటారు. 
 
పిల్లుల లాలాజలం, ఓడ్కా కలిపి అతడు టీకాలు తయారుచేస్తున్నట్లు సమాచారం అందడంతో అతడి లైసెన్సును అధికారులు సస్పెండ్ చేశారు. డాక్టర్ మింగ్ టె లిన్ అనే ఈ వైద్యుడు పిల్లలకు అనుమతిలేని టీకాలు ఇస్తున్నాడని ఫిర్యాదులు రావడంతో ఆరోగ్యశాఖకు చెందిన అధికారులు సోదాలు నిర్వహించారు. అక్కడ ఏమాత్రం శుభ్రత లేకుండా ఉన్న ఆఫీసులో కొన్ని ఇంజెక్షన్ సీసాలు, ట్యూబులు కనిపించాయి. వాటితోనే డాక్లర్ లిన్ టీకాలు తయారు చేస్తున్నట్లు తెలుసుకున్నారు. 
 
దాదాపు పదేళ్ల నుంచి తాను పిల్లల కోసం ప్రత్యామ్నాయ టీకాలు తయారుచేస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఏడు రోజుల పసికందుతో సహా చాలామందికి అతడు ఈ టీకాలు ఇచ్చాడు. కొన్ని సందర్భాల్లో ఓడ్కా లాంటి మద్యాన్ని, మరికొన్ని సందర్భాల్లో పిల్లి నోటి నుంచి తీసిన లాలాజలాన్ని కూడా ఉపయోగించి.. ఎలర్జీతో బాధపడే పిల్లలకు టీకాగా ఇచ్చేవాడు. ఈ టీకాల నుంచి పాదరసాన్ని తీసేయడానికి 'వేవ్ ఫ్రంట్ 2000' అనే పరికరాన్ని ఉపయోగించేవాడని పేర్కొన్నారు. 
 
కొన్నిసార్లు చుక్కల మందు రూపంలోను, మరికొన్నిసార్లు ముక్కులో స్ప్రే చేసుకునేవిధంగా ఈ టీకాలు ఇచ్చినట్లు ఒక పేషెంట్ కుటుంబ సభ్యులు తెలిపారు. అతడు అనుసరించే విధానాలకు గానీ, అతడి మందులకు గానీ అమెరికాలోని ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ విభాగం నుంచి అనుమతి లేదు. అలాగే, ఈ మందులు వాడటం వల్ల వచ్చే దుష్ప్రభావాల గురించి కూడా అతడు రోగులకు చెప్పలేదు. ఈ వ్యవహారంపై చికాగోలో అక్టోబర్ 11న విచారణ జరగనుంది.