శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : ఆదివారం, 15 అక్టోబరు 2017 (14:58 IST)

పాకిస్థాన్‌తో స్నేహం కోరుకుంటున్న అమెరికా.. డొనాల్డ్ ట్రంప్

పాకిస్థాన్‌తో అమెరికా సంబంధాలను పునఃప్రారంభిస్తున్నాయా? అంటే అవుననే సంకేతాలే వస్తున్నాయి. ఉగ్రవాదులకు పాకిస్థాన్ చేస్తున్న సాయంతో విరక్తి చెంది దూరమైనట్లు కనిపించిన అమెరికా, తిరిగి ఆ దేశానికి దగ్గరవుత

పాకిస్థాన్‌తో అమెరికా సంబంధాలను పునఃప్రారంభిస్తున్నాయా? అంటే అవుననే సంకేతాలే వస్తున్నాయి. ఉగ్రవాదులకు పాకిస్థాన్ చేస్తున్న సాయంతో విరక్తి చెంది దూరమైనట్లు కనిపించిన అమెరికా, తిరిగి ఆ దేశానికి దగ్గరవుతోంది. రెండు దేశాలూ సరికొత్త సత్సంబంధాలను ప్రారంభిస్తున్నాయని ట్రంప్ స్వయంగా తెలిపారు. 
 
పాకిస్థాన్ కేంద్రంగా నడుస్తున్న హక్కానీ టెర్రరిస్టుల వద్ద అమెరికన్- కెనడియన్ కుటుంబాన్ని పాక్ ప్రభుత్వం విడిపించిన నేపథ్యంలో ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ.. అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలు ఇచ్చిన సమాచారంతో పాకిస్థాన్ సైన్యం హక్కానీ టెర్రరిస్టుల బారి నుంచి తమ పౌరురాలు కోలేమాన్, ఆమె భర్త బోయ్ లేలను రక్షించాయని చెప్పారు. ఈ ఘటనతో పాకిస్థాన్ అమెరికాతో మరింత స్నేహాన్ని కోరుతుందన్న సంకేతాలు వెలువడ్డాయని, తాము కూడా అదే విధమైన అభిప్రాయంతో ఉన్నామన్నారు.