శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 21 జనవరి 2017 (09:42 IST)

అమెరికా అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్.. తొలి సంతకం ఏ ఫైల్‌పై చేశారో తెలుసా?

అమెరికా కొత్త అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేశారు. అట్టహాసంగా జరిగిన ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి అతిరథమహారథులంతా హాజరయ్యారు. ఆ తర్వాత తన ప్రారంభ అధికార ప్రసంగం చేశారు. ఈ ప్రసం

అమెరికా కొత్త అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేశారు. అట్టహాసంగా జరిగిన ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి అతిరథమహారథులంతా హాజరయ్యారు. ఆ తర్వాత తన ప్రారంభ అధికార ప్రసంగం చేశారు. ఈ ప్రసంగం ముగించుకుని నేరుగా ఓవల్ కార్యాలయంలో ప్రవేశించిన ఆయన... ముందు నుంచి చెబుతున్నట్లు గానే మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా కేర్ ఫైల్ మీద తన తొలి సంతకం చేశారు. 
 
తన ఎన్నికల ప్రచారంలో తాను అధ్యక్షుడినైతే... బరాక్ ఒబామా కేర్‌ను మార్చి తీరుతానని చెపుతూ వచ్చారు. దీనికి సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ మీద ట్రంప్ సంతకం చేశారు. అయితే, ఈ ఆర్డర్‌లో వివరాలు ఏంటన్న విషయాన్ని వైట్ హౌస్ అధికారులు వెంటనే వెల్లడించలేదు. ఒబామాకేర్ అనే ఆరోగ్య పథకాన్ని మారుస్తానని ఆయన చెప్పినా, దాని స్థానంలో ఎలాంటి పథకం తీసుకురాబోతున్నామన్న విషయాన్ని అటు ట్రంప్ గానీ, ఇటు రిపబ్లికన్లు గానీ ఇంతవరకు ఎక్కడా చెప్పలేదు.
 
కొత్తగా నియమితులైన రక్షణ శాఖ మంత్రి జేమ్స్ మాటిస్, హోంలాండ్ సెక్యూరిటీ మంత్రి జాన్ కెల్లీలకు సంబంధించిన కమిషన్ల మీద కూడా ట్రంప్ సంతకాలు చేశారు. తొలిరోజు చాలా బిజీగా ఉంది గానీ, ఇది చాలా అందమైన రోజని ట్రంప్ విలేకరులతోవ్యాఖ్యానించారు.