Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

అమెరికా శాంతిని ఆకాంక్షిస్తోంది.. అవసరమైతే చర్చలకు సిద్ధం.. ట్రంప్ స్వరం మారింది..

శుక్రవారం, 19 మే 2017 (10:23 IST)

Widgets Magazine
donald trump

ఉత్తర కొరియా చీఫ్ కిమ్ జాంగ్‌ను ఎలా దారికి తెచ్చుకోవాలో తమకు బాగా తెలుసునని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఉత్తర కొరియాపై కారాలు మిరియాలు నూరే ట్రంప్.. స్వరం మారింది. అమెరికా ప్రపంచ శాంతికి ఆకాంక్షిస్తోందన్నారు. ప్రపంచ శాంతి, శ్రేయస్సు కోసం తమను ద్వేషించేవారిని కూడా అమెరికా క్షమిస్తుందన్నారు. అవసరమైతే అలాంటి వారితో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ట్రంప్ ప్రకటించారు. 
 
అంతేగాకుండా చర్చలకు ఉత్తరకొరియా నిరాకరించిన సమక్షంలో ఆంక్షలు విధించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ట్రంప్ చెప్పారని దక్షిణకొరియా మీడియా అధికార ప్రతినిధి హంగ్ సీయోక్ హున్ వెల్లడించారు. తాజాగా దక్షిణ కొరియా దౌత్యాధికారులతో జరిగిన సమావేశంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు హంగ్ సీయోక్ తెలిపారు. 
 
గత నెలలో దక్షిణ కొరియా, జపాన్ సముద్ర జలాల్లో భారీ ఎత్తున సైన్యాన్ని మోహరించి యుద్ధానికి సర్వసన్నద్ధంగా ఉన్నామని గతనెలలో బెదిరింపులకు దిగిన ట్రంప్.. ఉత్తరకొరియా క్షిపణి పరీక్షతో ఓ అంచనాకు వచ్చారు. శత్రుదేశం తాము ఊహించినంత బలహీనమైన దేశం కాదని అర్థం చేసుకున్నారు. అదే సమయంలో ఉత్తరకొరియా వెనుక రష్యా, చైనాలున్నాయన్న సంగతిని తెలుసుకుని ట్రంప్ ప్రస్తుతం స్వరం మార్చారని వార్తలొస్తున్నాయి.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

యుద్ధ మేఘాలు : ఉత్తర కొరియాపై దాడికి కదిలిన యుఎస్ వార్ షిప్?

అమెరికా, ఉత్తరకొరియా దేశాల మధ్య యుద్ధ మేఘాలు అలముకుంటున్నాయి. ఉత్తర కొరియా ధిక్కార ...

news

దేవుడెపుడు శాసిస్తాడో.. రజనీకాంత్ ఎప్పుడు రాజకీయాల్లోకి వస్తారో?

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ అరంగేట్రంపై ఇంకా క్లారిటీ రాలేదు. రాజకీయాలపై అభిమానుల ...

news

40 యేళ్ళుగా తమిళనాడులో ఉంటున్నా.. నేను తమిళుడిని కాదా? రజనీకాంత్

తాను తమిళుడుకాదంటూ బీజేపీకి చెందిన రాజ్యసభ సభ్యుడు డాక్టర్ సుబ్రమణ్య స్వామితో పాటు ...

news

ఆన్‌లైన్‌లో అన్నాడీఎంకే మహిళా ఎంపీ అశ్లీల ఫోటో... ఢిల్లీ పోలీసుల కేసు

అన్నాడీఎంకే బహిష్కృత ఎంపీ శశికళ పుష్పను అశ్లీలంగా చూపిస్తూ ఆన్‌లైన్‌లో పోస్టులు పెట్టారు. ...

Widgets Magazine