గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , శుక్రవారం, 27 జనవరి 2017 (06:26 IST)

గోడ కట్టడానికి డబ్బులివ్వకపోతే మా దేశానికి రావద్దు: ట్రంపిజంలో కొత్త పోకడ

అమెరికా దక్షిణాన ఉన్న మెక్సికో నుంచి అక్రమ వలసలను అడ్డుకునేందుకు ఆ దేశ సరిహద్దుల్లో దుర్భేద్యమైన గోడ నిర్మించేందుకు ఉద్దేశించిన రెండు ఆదేశాలపై గురువారం సంతకాలు చేసిన ట్రంప్.. గోడ నిర్మాణ ఖర్చులను మెక్సికో కూడా పంచుకోవాలని సూచించారు. దీన్ని మెక్సికో త

ఎవరైనా సరిహద్దుల మధ్య కంచెలు కట్టాలంటే అవతలి పక్షంతో లేక దేశంతో కాస్త మర్యాదగా, నాగరికంగా వ్యవహరించి తమ పని నెరవేర్చుకుంటారు. కాని అమెరికా నూతన అధ్యక్షుడుగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ సాధారణ మర్యాదాలకు తాను భిన్నమని మరోసారి నిరూపించుకున్నారు. అమెరికా దక్షిణాన ఉన్న మెక్సికో నుంచి అక్రమ వలసలను అడ్డుకునేందుకు ఆ దేశ సరిహద్దుల్లో దుర్భేద్యమైన గోడ నిర్మించేందుకు ఉద్దేశించిన రెండు ఆదేశాలపై గురువారం సంతకాలు చేసిన ట్రంప్.. గోడ నిర్మాణ ఖర్చులను మెక్సికో కూడా పంచుకోవాలని సూచించారు. దీన్ని మెక్సికో తీవ్రంగా ఖండించటమే కాకుండా ఎట్టిపరిస్థితుల్లోనూ గోడ నిర్మాణానికి సహకారం ఉండదని ఆ దేశాధ్యక్షుడు ఎన్రిక్‌ పెనా నీటో స్పష్టం చేశారు.
 
ఇలాంటి పరిస్థితుల్లో ఏ దేశమైనా ఏం చేస్తుంది? సామరస్య పూర్వకంగా పొరుగుదేశంతో చర్చింది, ఒప్పించి కార్యసాఫల్యం చేసుకుంటుంది. కాని ట్రంప్ రూటే వేరు కదా. తన మాట కాదన్న మెక్సికోను బండకేసి బాదారు. ఎలా అంటే.. ‘గోడ నిర్మాణ ఖర్చులు పంచుకోకపోతే జనవరి 31న జరపనున్న అమెరికా పర్యటనను రద్దుచేసుకోండి’ అని నీటోను ఉద్దేశిస్తూ చేసిన ట్వీట్‌లో పేర్కొన్నారు. దీంతో అమెరికా–మెక్సికోల మధ్య వాతావరణం వేడెక్కింది. 
 
ట్రంప్‌ ట్వీట్‌ నేపథ్యంలో తన అమెరికా పర్యటనను రద్దుచేసుకుంటున్నట్లు నీటో ప్రకటించారు. అంతకుముందు గోడ నిర్మాణ ఆదేశాలపై సంతకం సందర్భంగా ట్రంప్‌ మాట్లాడుతూ.. ‘సరిహద్దుల్లేని దేశం దేశమే కాదు. ఈ రోజునుంచి అమెరికా తన సరిహద్దులపై పూర్తి నియంత్రణ సాధిస్తుంది’ అని వెల్లడించారు. అమెరికా–మెక్సికోలు 3,100 కిలోమీటర్ల సరిహద్దులను పంచుకుంటున్నాయి. అయితే ఇందులో 1600 కిలోమీటర్లకు మాత్రమే గోడ నిర్మించనున్నారు. మిగిలిన చోట్ల కంచె, అక్కడక్కడ సిమెంటు స్లాబులతో కట్టిన సరిహద్దు ఉంది. ‘ఈ రెండు ఆదేశాలు మా ఇమిగ్రేషన్  సంస్కరణల్లో భాగమే’ అని అమెరికా అధ్యక్షుడు వెల్లడించారు.
 
ట్రంప్‌ నిర్ణయాన్ని మెక్సికో తీవ్రంగా ఖండించింది. ఈ గోడ నిర్మాణానికి తమవంతు సహకారం ఉండబోదని మెక్సికో అధ్యక్షుడు ఎన్రిక్‌ పెనా నీటో తెలిపారు. ఇరు దేశాల ప్రజలను ఒకటి చేయాల్సిందిపోయి.. విడగొట్టేందుకే ట్రంప్‌ ప్రయత్నిస్తున్నారన్నారు. అవతలి దేశం ప్రజలను గౌరవించటం కూడా అమెరికా నేర్చుకోవాలన్నారు.