Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ముస్లిం దేశాలపై నిషేధం.. కింది కోర్టుల నిర్ణయాలకు ట్రంప్ సవాల్.. సుప్రీం తీర్పు కోసమే వెయిటింగ్..

మంగళవారం, 6 జూన్ 2017 (13:52 IST)

Widgets Magazine
donald trump

ఆరు దేశాలకు చెందిన ముస్లిం పౌరులు అమెరికాలోకి అడుగుపెట్టకుండా విధించి వివాదాస్పద నిషేధాన్ని అమల్లోకి తెచ్చేందుకు డొనాల్డ్ ట్రంప్ సర్కారు ఆ దేశ సుప్రీం కోర్టును విజ్ఞప్తి చేసింది. ట్రంప్ జనవరిలో తొలిసారి నిషేధాజ్ఞలు జారీ చేసిన నేపథ్యంలో వాటిని అమెరికా కోర్టులు నిలుపుదల చేశాయి. న్యాయపరమైన సవాళ్లను అధిగమించేందుకు మార్చిలో మరోసారి, ఆరు దేశాల పౌరులకు వీసాల జారీని నిలిపివేస్తూ ట్రంప్‌ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. 
 
ఇది రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమేనని అభిప్రాయపడ్డ నాలుగో సర్క్యూట్‌ అప్పీళ్ల కోర్టు, అమల్లోకి రాక ముందే ఈ ఉత్తర్వులను కూడా నిలిపివేసింది. దీంతో తాజాగా కిందు కోర్టుల నిర్ణయాలను సవాలు చేస్తూ ట్రంప్‌ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది.
 
ఈ నేపథ్యంలో తాను ప్రతిపాదించిన ప్రయాణ నిషేధ విధానం మరింత కఠినంగా ఉండాలని ట్రంప్ ట్విట్టర్లో అభిప్రాయం వ్యక్తం చేశారు. అందుకే ఈ కేసును పరిశీలిసల్తున్న సుప్రీం కోర్టు మరింత త్వరగా విచారణ పూర్తి చేయాలని కోరారు. ప్రయాణ నిషేధంపై తొలుత ఇచ్చిన ఆదేశాలకే న్యాయ విభాగం కట్టుబడి ఉండాలి. నీరుగార్చిన, రాజకీయపరంగా మార్పులు చేసిన ఉత్తర్వులను సుప్రీంకోర్టుకు సమర్పించారు. వాటిని పట్టించుకోవాల్సిన పనిలేదు. దేశ భద్రత దృష్ట్యా అమెరికా వచ్చే వారిని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాం. కోర్టులు నెమ్మదిగా, రాజకీయంగా పనిచేస్తున్నాయని ట్విట్టర్లో ట్రంప్ వ్యాఖ్యానించారు.
 
కాగా.. ఇరాన్‌, లిబియా, సొమాలియా, సూడాన్‌, సిరియా, యెమెన్‌కు చెందినవారిని తమ దేశంలోకి రానివ్వకుండా, ట్రంప్‌ జనవరిలో తొలిసారి నిషేధాజ్ఞలు జారీ చేసిన సంగతి తెలిసిందే.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

కవల పిల్లలను గట్టిగా కౌగిలించుకుని ఊపిరాడనీయకుండా చంపేసిన కసాయి తల్లి

కవల పిల్లలు పుట్టారు. వారు ఆలనాపాలనా చూసుకుని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తల్లి.. ...

news

చిన్నమ్మను రహస్యంగా కలిసిన విజయమ్మ.. విలీనానికి 2 నెలల గడువు ఇచ్చిన దినకరన్..?

దినకరన్ చిన్నమ్మను కలిసి వెళ్ళాక.. శశికళను ప్రముఖ సినీ నటి, కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ...

news

ఆటో ఎక్కిన మహిళపై గ్యాంగ్ రేప్.. ఆమె చేతిలో ఉన్న చిట్టితల్లిని రోడ్డుపైకి విసిరేశారు..

హర్యానాలో అమానుష ఘటన చోటుచేసుకుంది. తన ఎనిమిది నెలల బిడ్డతో కలిసి ఆటో ఎక్కిన మహిళలపై ...

news

టీటీవీ దినకరన్‌‌ను ఎప్పుడో పార్టీ నుంచి తొలగించాం.. శశికళతో సంబంధం లేదు

ఆర్కే నగర్ ఎన్నికల వ్యవహారంలో ఏకంగా ఎన్నికల కమిషన్‌కే లంచం ఎరచూపి అడ్డంగా దొరికిపోయిన ...

Widgets Magazine