బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : గురువారం, 21 మే 2015 (16:35 IST)

విమానాన్ని కూల్చేస్తాం అనేలోపు.. కాక్‌పీట్ నుంచి దూకేసిన పైలట్!

మత్తుపదార్థాల అక్రమ రవాణాపై అమెరికా ఉక్కుపాదం మోపుతోంది. దీంతో ఉత్తర ప్రాంత దేశాల నుంచి మత్తు పదార్థాలను అడ్డుకునేందుకు పకడ్బందీ చర్యలు చేపట్టింది. ముఖ్యంగా వెనెజులా నుంచి మత్తుపదార్థాల రవాణాను నియంత్రించేందుకు అన్ని మార్గాలను కట్టుదిట్టం చేసింది. దీంతో తమ గగనతలంపై వచ్చే చిన్న విమానాలపై కొలంబియా వైమానిక సంస్థ ప్రత్యేక దృష్టిని సారించింది.
 
వెనెజులాకు చెందిన ఓ అక్రమ మత్తుపదార్థాల రవాణా విమానం టన్నుకు పైగా కొకైన్‌ అనే మత్తు పదార్థంతో బయల్దేరింది. దీనిని గుర్తించిన కొలంబియా ఎయిర్ ఫోర్స్ విమానాన్ని కూల్చేస్తామని హెచ్చరించింది. దీంతో అప్రమత్తమైన ఆ పైలట్ అందులో నుంచి దూకేశాడు. 
 
డ్రైవింగ్ చేయకపోవడంతో మోటార్లు విఫలమైన ఆ విమానం కొలంబియా తీరంలో కుప్పకూలిపోయింది. విమానంలోంచి దూకేసిన పైలట్ ప్రాణాలు కోల్పోగా, అతడి మృతదేహాన్ని కొలంబియా తీరప్రాంత గస్తీ దళం స్వాధీనం చేసుకొంది. అయితే, మృత్యువాతపడిన పైలట్ ఏ దేశానికి చెందిన వాడనే దానిని ఇంకా వెల్లడించలేదు.