గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : సోమవారం, 27 ఏప్రియల్ 2015 (10:23 IST)

నేపాల్‌లో మూడో రోజూ ప్రకంపనలు : మృతులు 3200

నేపాల్‌లో మూడో రోజు కూడా భూమి కంపించింది. దీంతో ఆ దేశ ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని జీవిస్తున్నారు. దీనికితోడు భారీ వర్షాలు కురుస్తుండడంతో సహాయక చర్యలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మంచుకొండల మధ్య ఆధ్యాత్మికతతో వెలుగొందే నేపాల్ మృత్యు భూమిగా మారగా, మరణించిన వారి సంఖ్య అధికారిక లెక్కల ప్రకారమే మూడు వేలు దాటింది. శిథిలాల కింద మరో మరో 2 నుంచి 4 వేల వరకూ ఉండొచ్చని భావిస్తున్నారు.
 
మరోవైపు.. భారీ భూకంపంతో సర్వం కోల్పోయిన నేపాల్ వాసులు ప్రత్యక్ష నరకం జీవితాన్ని అనుభవిస్తున్నారు. ఆహారం, తాగునీరు, విద్యుత్ అవసరాలు తీరక తాత్కాలిక గుడారాల్లోనే ఆవాసం పొందుతున్నారు. అంతర్జాతీయ దేశాల సహాయంతో సమస్యలను ఎదుర్కొంటామని నేపాల్ ప్రధాని వ్యాఖ్యానించారు. భూకంపంతో కుదేలైన నేపాల్‌ను ఆదుకునేందుకు మరిన్ని సహాయక బృందాలను పంపుతున్నట్టు భారత్ ప్రకటించింది.