శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : ఆదివారం, 21 డిశెంబరు 2014 (11:15 IST)

జనాలను భయపట్టేందుకు నైజీరియాలో ఉగ్రవాదుల అరాచకత్వం.. వృద్ధుల కాల్చివేత!

ఉగ్రవాదులు తమ క్రూరత్వాన్ని పరిపరి విధాలుగా ప్రదర్శిస్తున్నారు. తమను చూస్తే జనాలు గజగజ వణికిపోవాలని భావించి వృద్ధులను బహిరంగంగా ఉరితీసే ఆటవిక చర్యలకు శ్రీకారం చుట్టారు. నైజీరియాలో ఈ దారుణం చోటు చేసుకుంది. 
 
నైజీరియాలో వయసు పైబడిన వారిని ఎంచుకొని.. ఉగ్రవాదులు పెద్దఎత్తున ఊచకోతలకు పాల్పడుతున్నారు. గ్వోజా ప్రాంతంలో ఇటీవల 50 మంది వృద్ధులను వరసగా నిలబెట్టి ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాదులు కాల్చేశారు. దానివల్ల ప్రజల్లో ఎక్కువ భయాన్ని సృష్టించగలుగుతామని వారు భావిస్తున్నారు. ఈ విషయాన్ని ఆ దేశ సైనిక వర్గాలు వెల్లడించాయి. 
 
మరోవైపు.. ఇరాక్‌లో ఉగ్రవాదులు జరిపిన బాంబు దాడిలో ముగ్గురు సైనికులు సహా పది మంది మరణించారు. దేశ రాజధాని బాగ్దాద్‌లో బాగా రద్దీగా ఉండే వాణిజ్య కూడలిలో ఈ పేలుడు జరిపినట్టు సైనిక వర్గాలు తెలిపాయి.