జవాన్ తలను కిరాతకంగా హతమార్చిన ఘటనలో పాక్ హస్తముంది: భారత ఆర్మీ
మంగళవారం, 29 నవంబరు 2016 (11:00 IST)
జవానును అతి కిరాతకంగా నరికి హతమార్చిన ఘటనలో పాకిస్థాన్ హస్తమున్నట్లు తేలింది. ఈనెల 22వ తేదీన మిచ్చల్ సెక్టార్‌లో పాక్ బలగాలు కాల్పులు జరపగా ముగ్గురు సైనికులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. జమ్మూ కాశ్మీర్లోని మిచ్చెల్ సెక్టార్‌లో ఒక జవాన్ తలను అతికిరాతకంగా హతమార్చిన ఘటనలో పాక్ హస్తముందనేందుకు కొన్ని ఆధారాలు కూడా సేకరించినట్లు భారత ఆర్మీ అధికారులు తెలిపారు.
ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టగా పాకిస్థాన్ గుర్తులు ఉన్న కొన్ని ఫొటోలు, ఆహారపదార్థాలు, గ్రనేడ్‌లు, యూఎస్ మార్కింగ్ ఉన్న రేడియో సెట్స్, రాత్రివేళ దృశ్యాలను చిత్రించే కెమెరాలు స్వాధీనం చేసుకున్నట్లు ఉత్తర ఆర్మీ కమాండ్ స్పష్టం చేసింది. ఈ ఘటనకు ప్రతీకారంగా భారత సైన్యం ఎదురుదాడికి దిగింది. 24 గంటల వ్యవధిలోనే నియంత్రణ రేఖ వద్ద ఇరువైపుల జరిగిన కాల్పుల్లో పాక్‌కు చెందిన 15-16 సైనిక స్థావరాలను భారత సైన్యం ధ్వంసం చేసింది.
Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine