మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 23 జులై 2014 (17:53 IST)

ఫేస్ బుక్ అకౌంట్ ఉందా? అయితే కొంప కొల్లేరే!!

ఫేస్ బుక్ అకౌంట్ ఉందా? అయితే కొంప కొల్లేరే అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సామాజిక సంబంధాలు విస్తృతం చేసుకునేందుకు, అవకాశాలు అందిపుచ్చుకునేందుకు ఉద్భవించిన ఫేస్ బుక్ పచ్చని సంసారాల్లో చిచ్చురేపుతోందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఫేస్ బుక్ విరివిగా వాడుతున్న కారణంగా అమెరికాలోని అన్ని రాష్ట్రాల్లో విడాకుల కేసులు పెరిగినట్టు పరిశోధకులు తెలిపారు. 
 
గత ఏడాది కాలంలో ఫేస్ బుక్ కారణంగా 4 శాతం ఎక్కువ విడాకుల కేసులు నమోదైనట్టు అధ్యయనకారులు చెప్పారు. ఫేస్ బుక్, ట్విట్టర్ వంటి వెబ్ సైట్లలో ఎక్కువ శాతం గడిపేవారి వైవాహిక జీవితంలో స్పర్థలు ఎక్కువైనట్టు గమనించామని పరిశోధకులు స్పష్టం చేశారు. ఫేస్ బుక్ కారణంగా మనదేశంలో అమ్మాయిలు చాలా సమస్యల్లో ఇరుక్కుంటున్నారు. చాలా మంది మోసపోతున్నారు. 
 
ఫేస్ బుక్ మోసాలు ఈ మధ్య కాలంలో విరివిగా చోటుచేసుకుంటున్న విషయం తెలిసిందే. ఫేస్ బుక్‌లో పోస్టు చేస్తున్న ఫోటోలు, పెడుతున్న కామెంట్ల కారణంగా చాలా కుటుంబాల్లో సమస్యలు తలెత్తినట్టు నిపుణులు చెప్పారు.